ముదురు జంట వివాహం.. పెళ్లి పెద్దగా కరీనా కపూర్.. ఆగ్రహంతో సల్మాన్ కుటుంబం!

బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, మలైకా అరోరా డేటింగ్ వ్యవహారం సినీ పరిశ్రమలో ఆసక్తిని రేపుతున్నది. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. ఇటీవలే తమ డేటింగ్, అఫైర్ విషయాన్ని పబ్లిక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన కరీనా కపూర్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అర్జున్, మలైకా పెళ్లికి సంబంధించిన విషయాలను వెల్లడించింది. కరీనా చెప్పిన విషయాలు ఏమిటంటే..

గుట్టుచప్పుడుగా డేటింగ్

గుట్టుచప్పుడుగా డేటింగ్

కొద్ది రోజుల క్రితం వరకు అర్జున్, మలైకా అరోరా చాటుమాటుగా, గుట్టుచప్పుడుగా తిరిగేవారు. ఇటీవల కాలంలో వారిద్దరూ బాహాటంగా మీడియా ముందు కనిపిస్తున్నారు. మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నారు. అంతేకాకుండా ఫోటోలకు ఫోజులు కూడా ఇస్తున్నారు. దాంతో వారిద్దరూ అన్ని రకాలుగా సిద్ధమయ్యారనే వాదన బలపడింది.

 అర్జున్, మలైకాకు ఫుల్ సపోర్ట్

అర్జున్, మలైకాకు ఫుల్ సపోర్ట్

అర్జున్ కపూర్, మలైకాకు కుటుంబ సభ్యుల నుంచి కూడా పూర్తి సహకారం అందుతున్నది. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన అర్జున్ సోదరి అన్షులా కపూర్ తన అన్నయ్య గర్ల్‌ఫ్రెండ్స్ గురించి అనేక విషయాలు ప్రస్తావించింది. వారితో నేను రెగ్యులర్‌గా మాట్లాడుతానని చెప్పింది. అర్జున్, మలైకా పెళ్లి చేసుకొంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది.

పెళ్లి గురించి కరీనా కపూర్ వెల్లడించిన విషయం

పెళ్లి గురించి కరీనా కపూర్ వెల్లడించిన విషయం

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కాఫీ విత్ కరణ్ షోలో కరీనాను ఉద్దేశించి కరణ్ ఇంట్రెస్టింగ్‌గా ప్రశ్నను అడిగాడు. అర్జున్ పెళ్లికి నీవు పెళ్లి పెద్దగా వ్యవహరిస్తావా అని ప్రశ్నించాడు. అయితే ఆ సమాధానాన్ని దాటవేయడానికి కరీనా ప్రయత్నించింది. అయితే తాను ఆ విషయాన్ని ఇప్పుడే చెప్పలేను. కానీ వారి పెళ్లి డేట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుసు అని అన్నారు.

సల్మాన్ కుటుంబం గుర్రుగా

సల్మాన్ కుటుంబం గుర్రుగా

మలైకా విషయానికి వస్తే ఇంతకు ముందు సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌తో ఆమెకు వివాహం జరిగింది. వ్యక్తిగత విభేదాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం మలైకా, అర్జున్ డేటింగ్ వ్యవహారంపై సల్మాన్ కుటుంబం గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఒకవేళ అర్జున్ కపూర్‌ను మలైకా పెళ్లి చేసుకొంటే ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X