Don't Miss!
- Automobiles ఆటోమేటిక్ గేర్ vs మాన్యువల్ ట్రాన్స్మిషన్.. వీటిలో ఏది బెస్ట్.?.. మనోళ్లు ఎక్కువగా వీటినే కొంటున్నారు.!!
- News ప్రధాని మోదీ ఎదుటే కాలు మీద కాలు వేసుకుని కూర్చొన్న టీడీపీ ఎమ్మెల్యే.. తరువాత రియాక్షన్ ఏమిటంటే..?
- Sports IPL 2024 సీజన్లో చెలరేగేది ఆ కుర్రాడే: సునీల్ గవాస్కర్
- Technology సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హై రిస్క్ అలెర్ట్.. ఈ ఫోన్లలో భద్రతా లోపాలు.. అప్డేట్ చేయకుంటే..??
- Travel దేశంలో ఒక్కోచోట ఒక్కోలా రంగుల హోలీ జరుపుతారని మీకు తెలుసా?!
- Lifestyle శరీరంలో ఈ భాగాల్లో వాపు కనబడుతుంటే, పక్కా మీ లివర్ డ్యామేజ్ అయ్యిందని అర్థం..!హెచ్చరిక
- Finance Market Crash: సెన్సెక్స్-నిఫ్టీ నేల చూపులు.. నిండా ముంచిన ఐటీ స్టాక్స్..
హాట్ ఫొటోతో షాకిచ్చిన కరీనా: ఇద్దరు బిడ్డలకు తల్లైనా తగ్గేదేలే.. అలాంటి పిక్ షేర్ చేసిందేంటి!
ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో దాదాపు ఇరవై ఏళ్లుగా ఇండియన్ సినిమాపై తన ప్రభావాన్ని చూపిస్తూ సత్తా చాటుతోంది హాట్ బ్యూటీ కరీనా కపూర్. సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో భాగమైన ఈ బ్యూటీ.. చాలా కాలంగా స్టార్ హీరోయిన్గా వెలుగొందుతోంది. వివాహం తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇక, ఈ మధ్య కాలంలో కరీనా కపూర్ సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయింది. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఓ హాట్ ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది. ఆ ఫిక్పై మీరూ ఓ లుక్కేయండి మరి.
ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిన రాయ్ లక్ష్మీ.. పటాకాగా మారి ముంబై వీధుల్లో మరింత హాట్‌గా!
అలా మొదలైన కెరీర్... ఇలా ఎంటర్
నటిగా ఎంట్రీ ఇవ్వాలన్న లక్ష్యంతో కరీనా కపూర్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అలా చాలా కాలం పాటు ఆ రంగంలో సత్తా చాటిన ఆమె.. 2000లో వచ్చిన 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి మూవీలోనే అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. తద్వారా స్టార్ అయింది.
పెళ్లైన హీరోతో కరీనా కపూర్ వివాహం
కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అంతకంటే ముందు నుంచే అతడితో ప్రేమాయణం సాగించిన ఈ భామ.. కొన్నేళ్ల తర్వాత అగ్నిసాక్షిగా అతడితో తాళి కట్టించుకుంది. అప్పట్లో ఇది బాగా హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం కావడమే.
కెరీర్‌ను ఆపని హీరోయిన్.. ఫుల్ బిజీ
పెళ్లి తర్వాత కూడా కరీనా కపూర్ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక బంధం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ సీన్లలో నటించడంతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేసింది. ఈ క్రమంలోనే కొన్నింటిలో అద్భుతమైన ప్రదర్శన కూడా ఇచ్చింది. తద్వారా పలు అవార్డులను సైతం అందుకుందీ బ్యూటీ.
కరీనాకు రెండో బిడ్డ.. గర్భంతోనూ అలా
కరీనా కపూర్ రెండు పర్యాయాలు గర్భంతో ఉన్నా కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించి మెప్పింది. అప్పుడు ఆమె డెడికేషన్‌ను అందరూ ప్రశంసించారు. అదే సమయంలో విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమెకు సైఫ్‌కు సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ నుంచి విసెష్ వచ్చాయి.
అందులో మాత్రం ఫుల్ బిజీగా ఉంటూ
సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కరీనా కపూర్ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతుంది. తద్వారా తరచూ ట్రెండ్ అవుతోంది.
హాట్ ఫొటోను షేర్ చేసిన కరీనా కపూర్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కరీనా కపూర్.. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. అందులో ఆమె స్లీవ్‌లెస్ టాప్ ధరించి ఉంది. అంతేకాదు, ఈ ఫొటోలో ఆమె క్లీవేజ్ షోతో కనువిందు చేస్తోంది. ఇద్దరు బిడ్డల తల్లైనా గ్లామర్ షోలో తగ్గేదే లేదు అన్నట్లుగా ఇందులో కనిపిస్తోందామె. దీంతో ఈ పిక్కు భారీ రెస్పాన్స్ రావడంతో వైరల్ అయిపోయింది.
అందులో ఆమెను చూసి షాక్‌లో ఫ్యాన్స్
రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్ పెద్దగా బయటకు రావడం లేదు. అలాగే, సోషల్ మీడియాలోనూ పాత ఫొటోలను షేర్ చేసింది. అయితే, ఇప్పుడు వదిలిన ఫొటో మాత్రం ప్రస్తుతానిదే. ఇక, ఇందులో కరీనా ఎంతో బొద్దుగా కనిపిస్తోంది. దీంతో ఈ ఫొటోను చూసిన ఫ్యాన్స్ అంతా షాక్‌కు గురవుతున్నారు. దీనిపై వాళ్లంతా తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.