ఇద్దరు బిడ్డల తల్లైనా తగ్గని కరీనా కపూర్: బ్రా మాత్రమే ధరించి ఘాటు ఘాటు ఫోజులు
దాదాపు మూడు దశాబ్దాలుగా భారతీయ సినిమాలో స్టార్‌గా వెలుగొందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న నటి కరీనా కపూర్. బాలీవుడ్ చిత్రాల్లోనే నటించినా తన అందం, అభినయంతో జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంది. అలా హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే భారీగా పాపులారిటీని సైతం సంపాదించుకుంది. అలా కరీనా కపూర్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ సుందరాంగి.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే కరీనా కపూర్ తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

అలా మొదలైన కరీనా కపూర్ కెరీర్
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది కరీనా కపూర్. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైంది. అలా అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. అలా దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుని హవాను చూపించింది.

ఆ హీరోకు రెండో భార్యగా మారింది
కరీనా కపూర్‌కు బాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత అతడిని వివాహం చేసుకుంది. అప్పట్లో ఇది సంచలనం అయింది. దీనికి కారణం సైఫ్‌కు అంతకు ముందే పెళ్లి అవడమే.

కెరీర్‌ను మాత్రం ఆపని హీరోయిన్
వివాహం తర్వాత ఎంతో మంది హీరోయిన్లు సినిమా రంగానికి దూరంగా ఉంటుంటారు. కానీ, కరీనా కపూర్ మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక బంధం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ సీన్లలో నటించడంతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేసి దూసుకుపోతోంది.

అప్పుడలా.. ఇప్పుడిలా వివాదాలు
సీనియర్ హీరో సైఫ్‌ను పెళ్లాడిన తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్ అందరికీ సుపరిచితుడు అయిపోయాడు. ఇక, ఈ మధ్యనే పుట్టిన రెండో కుమారుడికి 'జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. ఈ రెండు పేర్లూ వివాదం అయిన సంగతి విధితమే.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగా
ఎన్నో ఏళ్ల పాటు సినీ రంగంలో వరుస సినిమాలు చేసిన కరీనా కపూర్.. తన అభిమానులు బిగ్ స్క్రీన్ మీద అలరించేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె మూవీలకు దూరంగా ఉంటోంది. దీంతో సోషల్ మీడియాను వాడుకుని ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.

ఎక్కువగా అలాంటివే పోస్ట్ చేస్తోంది
కపూర్ సోషల్ సుదీర్ఘ కాలంగా కరీనా మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోది. ఈ క్రమంలోనే అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలను తెరుచుకుంది. వీటిలో అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తూ ఇంటర్నెట్‌ను ఓ ఊపు ఊపుతోంది.
Recommended Video

హాట్ వర్కౌట్లతో రెచ్చిపోయిన భామ
తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె కేవలం స్పోర్ట్స్ బ్రాతో పాటు ట్రాక్ ధరించి ఉంది. అంతేకాదు, క్లోజ్‌గా తీసుకున్న ఈ ఫొటోలో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇవి చాలా తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











