నా భర్తతో కాపురం చేయడం కష్టం.. ఆ విషయంలో పట్టుబట్టి ఫైట్.. కరీనా
ఉత్తరాది సినిమాలో మంచి ఫేమ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ చాలా మంది కనిపిస్తారు. ఇపుడు కొంచెం ఏజ్ అయిపోయింది కానీ ఒక్క పది పదిహేనేళ్ళు వెనక్కి వెళితే నార్త్ సినిమాని ఊపేసిన స్టార్ హీరోయిన్స్ చాలా మంది కనిపిస్తారు. మరి అలా తమ హాట్ షోతో మాత్రమే కాకుండా నటిగా కూడా మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న హీరోయిన్స్ లో కరీనా కపూర్ కూడా ఒకరు.
కాగా కరీనా బాలీవుడ్ లో ఎన్నో సెన్సేషనల్ హిట్స్ ని కొట్టింది. ఆల్ మోస్ట్ అక్కడ స్టార్ హీరోస్ అందరితో ఆమె నటించగా మన తెలుగు ఆడియెన్స్ కి ఐతే బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో చేసిన సూపర్ హీరో ఓరియెంటెడ్ సినిమా "రా వన్" తెలుగులో "జీ వన్" తో పరిచయం. అందులో ఛమ్మక్ చల్లో సాంగ్ ఇప్పటికీ వినిపిస్తుంది. అందులో రెడ్ కాస్ట్యూమ్ లో క్రేజీ డాన్స్ మూమెంట్స్ ఇప్పటికీ ట్రెండింగ్ గా కనిపిస్తాయి.

ఇలా మంచి స్టార్ స్టేటస్ తెచ్చుకున్న ఈమె రీసెంట్ గా బాలీవుడ్ హిట్ చిత్రం "క్రూ" లో కనిపించింది. కాగా ఈమె ప్రొఫిషినల్ లైఫ్ లో ఎలాంటి ఇబ్బంది లేదు కానీ తన పర్శనల్ లైఫ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఆమె వెల్లడించింది. కాగా కరీనా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారికి పిల్లలు కూడా ఉన్నారు.
అయితే వారి జీవితం కూడా అందరి దాంపత్య జీవితల్లానే తరచూ గొడవలతోనే కొనసాగుతుంది అని చెప్పుకొచ్చింది. నా భర్తతో కాపురం చేయడం కష్టం అది కూడా ఒకే ఇంట్లో ఇద్దరూ నటీనటులు అయితే అది మరింత కష్టం అని కరీనా చెప్పింది. మెయిన్ గా తమ ఇద్దరికీ టైం విషయంలో చాలా సార్లు గొడవలు జరుగుతాయని రివీల్ చేసింది.

ఇద్దరూ కూడా యాక్టర్స్ కావడంతో కలిసి గడపడానికి అసలు సమయమే దొరకదని ఒకవేళ ప్లాన్ చేసుకున్నా సైఫ్ ఒకోసారి ఏదొక పని పడి వెళ్ళిపోతాడు అని ఆ సమయంలో మాత్రం చాలా కోపం వస్తుంది అని తెలిపింది. ఇక ఈ ఒక్క విషయం లోనే కాదు ఇద్దరికీ ఏసీ విషయంలో కూడా గొడవ అవుతుందట. సైఫ్ ఏమో ఏసీ 16 డిగ్రీలు పెట్టుకుంటే కరీనా 20 డిగ్రీలు పెట్టుకుంటుంది అట.
ఇలా ఈ విషయంలో కూడా ఇద్దరికీ గొడవలు వస్తాయి అని దీంతో ఇద్దరూ కాంప్రమైజ్ అయ్యి 19 డిగ్రీస్ కి సెట్ చేసుకున్నట్టుగా ఆమె తెలిపింది. ఇలా తన భర్తతో మాత్రం కాపురం చేయడం కష్టమే అంటూ బాలీవుడ్ మీడియాలో ముచ్చటించింది. కాగా సైఫ్ అలీఖాన్ మన టాలీవుడ్ స్టార్ ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాలో విలన్ గా నటించగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భారీ చిత్రం "దేవర" లో విలన్ గా చేస్తున్నాడు. అలాగే ఈ సినిమాతోనే సైఫ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా పరిచయం అవుతుంది.


Click it and Unblock the Notifications











