Chandrayaan-3 చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్.. అద్బుత ఘట్టం కోసం కరీనా కపూర్ ఏం చేస్తున్నదంటే?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మోడ్యూల్ చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నది. బుధవారం అంటే ఆగస్టు 23వ తేదీ సాయంత్రం ల్యాండర్ చంద్రమండలంపై అడుగుపెట్టనున్నది. సహజసిద్దమైన శాటిలైట్‌తో చంద్రమండలాన్ని చేరే తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నది.
చంద్ర మండల ఉపరితలంపై ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రగ్యాన్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు దిగనున్నది. ఈ అద్బుతమైన ఘటాన్ని చూసేందుకు సగటు భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ అరుదైన ఘట్టంపై సినీ తారలు ఏమన్నారంటే..

చంద్ర మండలంపై ఇస్రో ప్రయోగించిన లూనార్ రోవర్ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలోనే ఈ ఘనతను సాధించిన నాలుగో దేశంగా ఈ భారత్ చరిత్ర పుటల్లోకి ఎక్కనున్నది. చంద్రయాన్ 2 తర్వాత చంద్రయాన్ ప్రయోగం సక్సెస్ దిశగా ముందుకెళ్తున్నది. చంద్రుడిపై శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్ 2 అంతరిక్ష నౌక చంద్రుడిపై ఆగస్టు 23వ తేదీన ల్యాండ్ కానున్నది. భారతీయ కాలమానం ప్రకారం 18.04 గంటలకు చంద్ర మండలంలో అడుగుపెట్టే అద్బుతమైన క్షణాలను నేరుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఇస్రో వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం కానున్నది.
దేశవ్యాప్తంగా స్కూల్స్, పలు సంస్థలు, టెలివిజన్ ఛానెల్స్ చంద్రుడిపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠశాలల్లో ఈ ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో కరీనా కపూర్ ఈ అరుదైన ఘట్టంపై స్పందించారు. భారత్ గర్వించే క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. అరుదైన సంఘటన. భారతీయురాలిగా గర్విస్తున్నాను. అందరి మాదిరిగానే నేను ఈ సంఘటనను చూడటానికి ఎదురు చూస్తున్నాను. నేను నా పిల్లలు తైమూర్, జేహ్‌తో కలిసి ఈ అద్బుతమైన సంఘటనను చూస్తాను అని కరీనా కపూర్ తెలిపారు.


Click it and Unblock the Notifications











