నేను వారికి తల్లిని కాను: కరీనా కపూర్, లైంగిక వేధింపులపై షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్, కుమారుడు ఇబ్రహీం గురించి మీడియాలో స్పందించింది. కరీనాను పిన్ని అంటే తట్టుకోలేదు అని సారా ఇటీవల కరణ్ జోహర్ షోలో వెల్లడించిన సంగతి తెలిసిందే. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్‌కు సారా, ఇబ్రహీం జన్మించిన సంగతి తెలిసిందే. సారా వ్యాఖ్యలపై స్పందించారు. అలాగే మీ టూ ఉద్యమంపై తన అభిప్రాయాన్నివెల్లడించారు. ఆమె ఏమన్నారంటే..

మీ టూ ఉద్యమాన్ని స్వాగతిస్తా

మీ టూ ఉద్యమాన్ని స్వాగతిస్తా

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు, దాడులపై బహిరంగ చర్చ జరుగడం శుభపరిణామం. పనిచేసే ప్రదేశంలో తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా మహిళలు ముందుకొచ్చి చెప్పడాన్ని స్వాగతించాలి. చాలా ఏళ్లుగా ఇలాంటి పరిణామం కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చకు కారణమైన మహిళలను అభినందించాలి. ఇలాంటి విషయాలు మహిళలకు భద్రతను కల్పిస్తాయి అని కరీనా అన్నారు.

పెద్ద, చిన్నా తేడా లేకుండా

పెద్ద, చిన్నా తేడా లేకుండా

నటుల్లో చిన్న, పెద్దా అనే తేడా లేకుండా భద్రత ఉండాలి. నీవు సూపర్‌స్టార్‌వి అయినా, చిన్న నటుడివి అయినా వారికి భద్రత అవసరం. హీరోయిన్లు గానీ, ఇతర నటులు గానీ చెప్పే విషయాలను లైవ్‌లో ఉండాలి. అప్పుడే సినీ పరిశ్రమలో మార్పు వస్తుంది అని కరీనా కపూర్ అన్నారు.

నేను తల్లిని కాదు..

నేను తల్లిని కాదు..

పిన్ని అంటే షాక్ తింటారని అనే వ్యాఖ్యలపై కరీనా స్పందిస్తూ.. నేను వారికి తల్లిని కాను. వారికి నేను ఓ ఫ్రెండ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తాను. వారి భవిష్యత్తు బాగుండాలని కోరుకొంటాను. వారు కోరుకొంటే సలహాలు మాత్రమే ఇస్తాను. వారికి ఏ క్షణంలోనైనా ఎలాంటి సహకారం కావాల్సి వచ్చిన ప్రతీ క్షణం అందుబాటులో ఉంటాను అని కరీనా పేర్కొన్నారు.

అమృతా సింగ్ అద్భుతంగా

అమృతా సింగ్ అద్భుతంగా

సారా, ఇబ్రహీంను వారి తల్లి అమృతా సింగ్ అద్భుతంగా తీర్చి దిద్దింది. వారి ప్రవర్తన, ఇష్టాయిష్టాలు చూస్తే ముచ్చటేస్తుంది. వారికి భవిష్యత్ బ్రహ్మండంగా ఉంటుంది. కెరీర్‌లో స్థిరపడటానికి వారికి నాకు తోచిన విధంగా అండగా ఉంటాను. ఓ పిన్నిగా కంటే ఫ్రెండ్‌గా ఉండటమే ఇష్టం అని కరీనా ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

తైమూరు అదీ అదృష్టం

తైమూరు అదీ అదృష్టం

చిన్నతనంలో తైమూరుకు మీడియా నుంచి బాగా పాపులారిటీ రావడం ఆనందంగా ఉంటుంది. బాల్యంలో అతడికి అంత గొప్ప ఆదరణ లభించడం దేవుడు ఇచ్చిన వరం. కానీ అతడిని బొమ్మలా చూస్తూ ఫొటోలు తీయడం నాకు నచ్చదు. వాడి ప్రైవసీకి భంగం కలుగకుండా ఉండాలని కోరుకొంటాను అని కరీనా చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X