TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
పాలిటిక్స్‌లోకి కరీనా కపూర్... ప్రతిష్ఠాత్మకమైన స్థానం నుంచి లోక్‌సభకు.. ధోని, గంభీర్ కూడా!

సినిమా పరిశ్రమ, క్రీడా రంగంలో పేరు ప్రతిష్ఠలు గడించిన తర్వాత సినీ తారల లక్ష్యం రాజకీయాలే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక కెరీర్ అయిపొయిందనే ఫీలింగ్ రాగానే చాలా మంది హీరో, హీరోయిన్లు, క్రీడాకారులు పాలిటిక్స్‌పై కన్నేస్తారు. గతంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో మన కళ్ల ముందు ప్రత్యక్ష్యమయ్యాయి. ప్రస్తుతం సినీ తార కరీనా కపూర్, క్రికెటర్లు ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్ రాజకీయాలపై కన్నేసినట్టు తెలుస్తున్నది. వివరాల్లోకి వెళితే
భోపాల్ నుంచి కరీనా కపూర్
కరీనా కపూర్ అత్తగారి పట్టణం మధ్యప్రదేశ్‌లోని భోపాల్. సైఫ్ ఆలీ ఖాన్‌ను పెళ్లి చేసుకొన్న తర్వాత భోపాల్‌కు రాకపోకలు జోరుగా కొనసాగుతున్నాయి. అక్కడి ప్రజలకు కరీనా ఇటీవల కాలంలో మరింతగా చేరువైంది. దాంతో కాంగ్రెస్ పార్టీ కరీనాను అక్కడి నుంచి బరిలోకి దించాలని ప్లాన్ చేసినట్టు బాలీవుడ్ మీడియా కోడైకూస్తున్నది.
నేను వారికి తల్లిని కాను: కరీనా కపూర్, లైంగిక వేధింపులపై షాకింగ్ కామెంట్స్
మామగారి వారసత్వం కొనసాగింపు
గతంలో సైఫ్ తండ్రి, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మన్సూర్ ఆలీఖాన్ పటౌడి 1991లో భోపాల్ నుంచి ఎన్నికల బరిలో దిగి ఓటమి పాలయ్యాడు. ఆ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు కరీనా కపూర్‌ను ఎన్నికల బరిలోకి దించే ప్రయత్నం జరుగుతుంది. దేశవ్యాప్తంగా కరీనా కపూర్‌కు ఉన్న గ్లామర్‌ను ఉపయోగించుకోవలని కాంగ్రెస్ కూడా ప్రయత్నిస్తున్నది.
మధ్యప్రదేశ్ నేతల కసరత్తు
కరీనా కపూర్ ఎన్నికల్లో పోటీ చేయించడానికి భోపాల్‌కు చెందిన ప్రముఖ రాజకీయనాయకుడు భారీగా కృషి చేస్తున్నాడట. అంతేకాకుండా కొద్దిరోజుల్లోనే మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్‌తో భేటీ కాబోతున్నారట. ఇందుకు కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే కరీనా పోటీ చేస్తుందా లేదా అనే ఇంకా తేలాల్సి ఉంది.
రాజకీయాల్లోకి ఎంఎస్ ధోని, గంభీర్
ఇక వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో క్రికెటర్లు ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్ బరిలోకి దూకేందుకు ప్రయత్నిస్తున్నారని తాజా వార్త వెలుగులోకి వచ్చింది. ఎంఎస్ ధోని జార్ఖండ్ నుంచి, గంభీర్ ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్టు తెలుస్తున్నది.
తఖ్త్ చిత్రంలో కరీనాకపూర్
ఇక కరీనా కపూర్ ప్రస్తుతం తఖ్త్ అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో కరణ్ జోహర్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌వీర్ కపూర్, అనిల్ కపూర్, ఆలియాభట్, వికీ కౌశల్ నటిస్తున్నారు. ఇక ధోని ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా పర్యటనలో బ్యాటింగ్‌తో సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే.