మొగుడి మీసాలు మెలిపెట్టిన కరీనా కపూర్..
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన భర్త సైఫ్ ఆలీఖాన్ మీసాలు చూసి ముచ్చటపడిపోయింది. సైఫ్ మీసాలతో ఆడుకొంటూ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఏకంగా తన భర్తతో కలిసి ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చింది కరీనా కపూర్. ఆ తర్వాత భర్త మీసాలు మెలేసి మురిసిపోయింది.
మీసాలతో సైఫ్ ముద్దొచ్చేస్తున్నాడంటూ క్రేజీ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. కరీనా, సైఫ్ సరసం చూసి నెటిజన్లు కామెంట్లపై కామెంట్లు వదిలారు.
సైఫ్ అలీ ఖాన్ తాజాగా లాల్ కప్తన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సాధువుగా కనిపించబోతున్నాడు. సోమవారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కోసం సైఫ్ గెడ్డం, మీసాలు పెంచడం జరిగింది.

ఎరోస్ ఇంటర్నేషనల్, ఆనంద్ ఎల్ రాయ్ సారథ్యంలోని కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ రూపొందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న రిలీజ్ కానున్నది. యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాలో నాగ సాధూగా సైఫ్ కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ఎన్‌హెచ్ 10 సినిమా డైరెక్టర్ నవదీప్ సింగ్ దర్శకత్వం వహించారు.
కరీనా కపూర్ విషయానికి వస్తే ఇటీవల ఆమె నటించిన వీర్ దే వెడ్డింగ్ సినిమాలో నటించింది. కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. అలాగే అక్షయ్ కుమార్‌తో గుడ్ న్యూస్, ఇర్ఫాన్ ఖాన్‌తో అంగ్రేజీ మీడియం అనే చిత్రాల్లో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











