Don't Miss!
- News
Astrology: కలలో పాములు కనిపిస్తే శుభమా? అశుభమా? తెలుసుకోండి!!
- Lifestyle
Today Rasi Palan 22 January 2023: ఈ రోజు సింహ రాశి వారు డబ్బు పరంగా అదృష్టవంతులు. కొత్త ఆదాయ వనరులను పొందుతారు
- Sports
IND vs NZ: ఆ ఒక్కటి కూడా గెలిస్తే రోహిత్ సేనదే అగ్రస్థానం!
- Finance
Pakistan debts: పాకిస్థాన్ పరిస్థితి ఇంత దారుణమా ?
- Automobiles
దేశీయ మార్కెట్లో రూ. 6 కోట్ల ఖరీదైన కారుని విడుదల చేసిన Bentley - వివరాలు
- Technology
Jio నుంచి రెండు కొత్త రీచార్జి ప్లాన్లు! ప్లాన్ల వివరాలు చూడండి!
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
బ్రా కూడా లేకుండా కరీనా రచ్చ: తల్లైనా తెగించేసిన హీరోయిన్
ఇండియా మొత్తంలో ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా చలామణీ అవుతున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకుని సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. సుదీర్ఘ కాలం పాటు వరుస సినిమాలతో హడావిడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. కొంత కాలంగా పెద్దగా వెండితెరపై కనిపించడం లేదు. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కరీనా కపూర్ ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా వచ్చి.. నేషనల్ రేంజ్‌కు
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే కరీనా కపూర్ మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఆ తర్వాత భారీ ఆఫర్లను దక్కించుకుని స్టార్‌గా ఎదిగింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులు అందుకుని నేషనల్ రేంజ్‌కు ఎదిగింది.
పబ్లిక్‌లోనే హీరోయిన్ శ్రీయ కొంటె పని: నా భర్తకు అలా చేస్తేనే ఇష్టమంటూ షాకింగ్‌గా!

ఆ హీరోకు రెండో భార్యగా వెళ్లి
అప్పట్లోనే పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇది పెద్ద వివాదంగా మారింది.

పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ
సైఫ్‌ను పెళ్లాడిన తర్వాత కూడా కరీనా కపూర్ తన కెరీర్‌కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు. పెళ్లి తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ భామ.. గర్భంతో ఉన్న సమయంలోనూ, తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించి మెప్పించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేస్తోంది. తద్వారా వివాహమైనా కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.
బోల్డు షోలో హద్దు దాటిన పాయల్: కాలు పైకి లేపి.. అలా సైగలు చేస్తూ!

మళ్లీ తల్లైంది.. రీఎంట్రీ నిరాశ
కరీనా కపూర్.. సైఫ్ అలీ ఖాన్‌తో తన వైవాహిక జీవితాన్ని సక్సెస్‌ఫుల్‌గా నడుపుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్, రెండో కుమారుడికి 'జహంగీర్' అని ఈ దంపతులు నామకరణం చేశారు. ఇక, ఇటీవలే కరీనా కపూర్.. 'లాల్ సింగ్ చద్దా' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ, ఇది ఆమెకు నిరాశనే మిగిల్చింది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
సుదీర్ఘ కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.
Bigg Boss: ఫ్యామిలీ ఎపిసోడ్‌లో రేవంత్‌కు షాక్.. కనికరించని బిగ్ బాస్.. ఆమె కోసం పెద్ద త్యాగం

హాట్ ట్రీట్ ఇస్తోన్న హీరోయిన్
సోషల్ మీడియాలో ఎంతో కాలంగా హడావిడి చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ కాక రేపుతోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం రెచ్చిపోతోంది. ఇలా కొంత కాలంగా కరీనా తన గ్లామర్ ట్రీట్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

హాట్ ఫొటో షేర్ చేసిన కరీనా
తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్రా కూడా వేసుకోకుండా బ్లేజర్‌ను ధరించి ఫోజులిచ్చింది. దీంతో ఈ పిక్‌లో ఆమె అందాలు చూపరులకు తెగ కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా కరీనా కపూర్ షేర్ చేసిన ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది బాగా వైరల్ అయిపోతోంది.