రాహుల్ గాంధీ అంటే పిచ్చి... ఆ కోరిక అలా తీర్చుకుంటా.. స్టార్ హీరో భార్య
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అవివాహితుడన్న సంగతి తెలిసిందే. 56 ఏళ్లు వచ్చిన ఇంకా సింగిల్‌గానే లైఫ్ లీడ్ చేస్తున్నారు. దేశంలోనే అతి పురాతన పార్టీకి, నెహ్రూ- గాంధీ కుటుంబానికి వారసుడిగా భారతదేశ రాజకీయాల్లో ఆయనది ప్రముఖ పాత్ర. ప్రధాని పీఠం అధిరోహించాలన్నది రాహుల్ గాంధీ కల.. ఇందుకోసం కాంగ్రెస్ శ్రేణులు నిర్విరామంగా కృషి చేస్తున్నాయి. రాహుల్ గాంధీకి సామాన్యులతో పాటు సినీ ప్రముఖుల్లోనూ అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలనుంది అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. కొన్నేళ్ల క్రితం నాటి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
కపూర్ కుటుంబ వారసురాలు కరీనా కపూర్. లాయర్ కావాలని అనుకున్న ఈ ముద్దుగుమ్మ లా కాలేజ్‌లో చేరి తొలి ఏడాదికే సినిమాల వైపు అడుగుపెట్టారు. కిషోర్ నమిత్ కపూర్ వద్ద నటనలో ఓనమాలు దిద్దింది. 2000వ సంవత్సరంలో రెఫ్యూజీ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు కరీనా. ముఝే కుచ్ కెహ్నా హై, అజ్నాబీ, కబీ కబీ కబీ గమ్, చమేలీ, దేవ్, ఓంకార, ఓతెల్లో, జబ్ వీ మీట్, త్రీ ఇడియట్స్ , వీ ఆర్ ఫ్యామిలీ, గోల్‌మాల్ 3, బాడీగార్డ్, రా వన్, ఎక్ మైనే ఔర్ ఏక్ తు, తలాష్, సింగమ్ రిటర్న్స్, బజరంగీ భాయిజాన్, ఉడ్తా పంజాబ్ తదితర చిత్రాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.

కెరీర్‌లో పలువురు హీరోలతో ప్రేమాయణం సాగించినట్లుగా కరీనా కపూర్‌పై ఎన్నో గాసిప్స్ వచ్చాయి. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌తో ప్రేమలో పడ్డ కరీనా ఆయనతో కొన్నాళ్లు డేటింగ్ చేశారు. అనంతరం అక్టోబర్ 16, 2012లో సైఫ్ అలీఖాన్‌ని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుటుంబ బాధ్యతలతో కొన్నాళ్లు సినీరంగానికి దూరంగా ఉన్నప్పటికీ ఇటీవల తిరిగి రీ ఎంట్రీ ఇచ్చి తన వయసు, ఇమేజ్‌కు తగిన పాత్రలు పోషిస్తున్నారు.
గతేడాది ఒక అగంతకుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి ప్రవేశించి ఆయనను కత్తితో పొడిచిన ఘటనతో కరీనా షాక్ అయ్యారు. సైఫ్ తిరిగి కోలుకోవడంతో ఆమె ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ప్రస్తుతం డాయైరా అనే సినిమాలో కరీనా నటిస్తున్నారు. సైఫ్ ఇంటికి కోడలిగా వెళ్లినప్పటికీ అన్ని పండుగలను జరుపుకుంటారు కరీనా. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. 50కి చేరువ అవుతున్నా చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు కరీనా.
కొన్నేళ్ల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఎవరితో డేటింగ్ చేయాలని అనుకుంటున్నారని యాంకర్ అడిగారు. దీనికి కరీనా సమాధానం చెబుతూ.. రాహుల్ గాంధీ అని టక్కున చెప్పేశారు. రాహుల్‌తో డేటింగ్ చేయాలనే కోరిక వెనుక కారణాన్ని కూడా కరీనా వెల్లడించింది. మా తాతయ్య, మా నాన్న, నా భర్త అందరూ సినీ కుటుంబాలకు చెందినవారే. నాకు రాజకీయాల గురించి ఆసక్తి ఎక్కువ. దాని గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నా. రాహుల్ గాంధీ రాజకీయ నేపథ్యం ఉన్న బలమైన కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఆయనతో డేటింగ్ చేస్తే రాజకీయాల గురించి తెలుసుకోవచ్చు. రాహుల్ గాంధీ అంటే నాకు క్రష్.. ఆయన ఫోటోలు చూస్తూనే ఉంటా.. ఆయనతో మాట్లాడాలి, డేటింగ్ చేయాలని కరీనా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications

















