ఆ మూడు లేకుండా పక్కపైకి వెళ్లను.. సైఫ్‌తో బెడ్రూం సీక్రెట్స్ వెల్లడించిన కరీనాకపూర్
బాలీవుడ్‌లో రొమాంటిక్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే ఠక్కున గుర్తుకొచ్చేది సైఫ్ ఆలీ ఖాన్, కరీనా కపూర్ దంపతులే. వారిద్దరి మధ్య వెండితెరపైనే కాదు.. వాస్తవ జీవితంలో కెమిస్ట్రీగా అదరగొట్టేలా ఉంటుంది. పెళ్లి తర్వాత ప్రేమ పక్షుల్లా కనిపించే ఈ స్టార్ కపుల్ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ షోకు హాజరై వెల్లడించిన విషయాలు ఏమిటంటే...
మరింత సెక్సీగా దివి వధ్యా.. లుంగీ కట్టుతో ఆకట్టుకొంటున్న బిగ్‌బాస్ బ్యూటీ

వైవాహిక జీవితంలోని సీక్రెట్స్
ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ అడిగే చిలిపి ప్రశ్నలకు సైఫ్, కరీనా తమదైన శైలిలో సమాధానం ఇచ్చారు. వైవాహిక జీవితానికి సంబంధించిన చిలిపి విషయాలను పూసగుచ్చినట్టు చెప్పారు. బాహ్య ప్రపంచానికి తెలియని పడక గది విషయాలను కూడా సైఫ్ ఎలాంటి జంకు లేకుండా వెల్లడించారు.

పడక గదిలో ఎలా అంటే..
పడక గదిలో కరీనాకపూర్ ఎలాం ఉంటుందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. చాలా బ్రహ్మండంగా ఉంటుంది. బయట నాకు కనిపించే కరీనాను మీరు గానీ.. మరెవరూ గానీ చూసి ఉండరు. చూసే అవకాశం కూడా ఉండదు. అలాంటి కరీనాను నేను పడకగదిలో చూస్తుంటాను అని సైఫ్ చెప్పారు.

ఇంట్లో కరీనా ఎలా ఉంటుందంటే..
బయటి ప్రపంచానికి సుందరంగా కనిపించే కరీనా కపూర్ ఇంటి వద్ద ఎలా ఉంటుందనే ప్రశ్నకు సైఫ్ జవాబిస్తూ.. మోకాళ్లపైకి ఉంటే పైజామాను ధరిస్తుంది. ఓ పాత టీషర్ట్‌ను వేసుకొంటుంది. పోని టెయిల్ స్టైల్‌లో జుట్టును ముడేసుకొని కనిపిస్తుంది. కొన్ని కీలక సందర్బాల్లో ముసి ముసి నవ్వులతో కనిపిస్తుంది అని సైఫ్ చెప్పాడు.

పడక గదిలో మూడు ఇష్టమైన విషయాలు
పడకపైకి వెళ్లే ముందు చేసే మూడు విషయాలతోపాటు ఎవ్వరికి తెలియని మీ బెడ్ రూమ్ సీక్రెట్ గురించి చెప్పమని కరణ్ జోహర్ అడిగితే.. సైఫ్ కంటే ముందే కరీనా ఠక్కున జవాబిచ్చింది. పడకపైకి వెళ్లడానికి ముందు.. ఓ వైన్ బాటిల్, పైజామా, సైఫ్ ఖాన్ ఈ మూడు నాతో ఉంటాయి అని కరీనా చెప్పింది. ఆ తర్వాత నా జవాబుకు తప్పకుండా గిఫ్ట్ హాంపర్ ఇవ్వాల్సిందే అంటూ కరీనా పట్టుబట్టింది

కరీనా కపూర్ కెరీర్ ఎలా ఉందంటే..
కరీనా కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు ఇర్ఫాన్ ఖాన్, రాధిక మదన్‌తో కలిసి అంగ్రేజీ మీడియం సినిమాలో నటించింది. ప్రస్తుతం అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహర్ రూపొందించే తఖ్త్ చిత్రంలో కూడా కనిపించనున్నారు. ఫారెస్ట్ గంప్ అనే చిత్రానికి రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా రూపొందుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











