పోర్న్ స్టార్‌తో కరీనా కపూర్ తొలిసారి.. ఉత్కంఠ కలిగిస్తున్న సంచలన షో!
బాలీవుడ్ అందాల తార కరీనా కపూర్ కొత్త అవతారం ఎత్తబోతోంది. సినీ తారలు బుల్లి తెర షోలకు హోస్ట్ లుగా మారడం ఇప్పుడు ట్రెండ్. బిగ్ బాస్ షో తో అన్ని భాషల్లో టాప్ హీరోలు హోస్ట్ లుగా మారుతున్నారు. హీరోయిన్లు కూడా బుల్లి తెరపై ప్రసారం అయ్యే వివిధ షోలతో హోస్ట్ అవతారం ఎత్తుతున్నారు. నేహా ధూపియా, అనితా ష్రాఫ్ నిర్వహిస్తున్న షోలు భారీ స్థాయిలో ప్రచారం పొందాయి. ఆ షోలకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. తాజగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ బుల్లి తెరపై కాదు కానీ, ఓ రేడియో షోకు హోస్ట్ గా మారింది.

పోర్న్ స్టార్‌తో ప్రారంభం
కరీనా కపూర్ హోస్ట్ గా మారిందనేదే పెద్ద న్యూస్. అంతకు మించేలా మరో సంచలనం ఉంది. కరీనా కపూర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలో తొలి గెస్ట్ సన్నిలియోన్ కావడం విశేషం. పోర్న్ స్టార్ గా ఓ వెలుగు వెలిగిన సన్నీ ఇప్పుడు బాలీవుడ్ ని దున్నేస్తోంది. సన్నీ భామ, కరీనా కలిసారంటే ఆ షో గురించి జనాల్లో ఉత్కంఠ పెరిగిపోవడం ఖాయం.

అందమైన ఫోటో
కరీనా కపూర్ తొలి రేడియో షోకు అప్పుడే ప్రచారం ప్రారంభించారు. కరీనా, సన్నీలియోన్ కలసి ఉన్న అందమైన ఫోటోని విడుదల చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సన్నీ బ్లాక్ డ్రెస్ లో అదరగొడుతోంది. వీరిద్దరూ కూర్చుని ఉన్న రూమ్ కలర్ ఫుల్ గా కనిపిస్తూ ఫోటోకి మరింత అందాన్ని తెచ్చిపెట్టింది.

త్వరలోనే ప్రసారం
కరీనా, సన్నీలియోన్ మధ్య ఇప్పటికే షోని రికార్డ్ చేశారు. త్వరలోనే ప్రసారం చేయనున్నారు. కరీనా కపూర్ మాట్లాడుతూ నేను తొలి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోకి ఇంతకంటే మంచి ఆరంభం ఆశించను అని సన్నిలియోన్ ని ఉద్దేశించి తెలిపింది. ఈ షోని అంతా వినబోతున్నారు. చాలా ఆసక్తిగా ఉందని కరీనా కపూర్ తెలిపింది.

వ్యక్తిగత జీవితానికి సంబంధించి
సన్నీ లియోన్ ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి, బాలీవుడ్ ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సన్నీలియోన్ కు కరీనా కపూర్ ఎలాంటి ప్రశ్నలు సంధించిందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.


Click it and Unblock the Notifications











