kareena Kapoor కుమారుడు జహంగీర్ ఆలీ ఖాన్ ఫోటో వైరల్.. అలా ముద్దు ముద్దుగా ఏం చేశాడంటే!

కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్ దంపతుల రెండో కుమారుడు జహంగీర్ ఆలీ ఖాన్ అలియాస్ జేహ్ ఆలీ ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. గత కొద్ది రోజుల క్రితం జహంగీర్ అని పేరు పెట్డడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వివాదం కాకుండా సంప్రదాయ పద్దతుల్లో రాఖీ జరుపుకొన్న సంఘటనతో అందర్ని ఆకట్టుకొన్నాడు. ప్రస్తుతం జేహ్ ఫోటో వైరల్ అయింది. జహంగీర్ అలీ ఖాన్ ఫోటో ఎందుకు వైరల్ అయిందంటే..

జెహ్ కాదు.. జహంగీర్ ఆలీ ఖాన్ అంటూ

జెహ్ కాదు.. జహంగీర్ ఆలీ ఖాన్ అంటూ


కరీనా కపూర్ తన రెండో కుమారుడికి జెహ్ అని నామకరణం చేసినట్టు మొదట తెలిపారు. ఆ పేరును తండ్రి రణ్‌ధీర్ కపూర్ కూడా ధృవీకరించారు. అయితే కొద్ది రోజులకు రెండో కొడుకు పేరు జెహ్ కాదు.. జహంగీర్ ఆలీ ఖాన్ అంటూ మీడియాలో వెలుగు చూసింది. దాంతో హిందువులపై దాడి, దండయాత్ర చేసిన రాజు పేరు పెట్టుకోవడం ఏమిటీ అంటూ విపరీతంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్ చేశారు.

తన కొడుకు ఫోటోను షేర్ చేయకుండా కరీనా...

తన కొడుకు ఫోటోను షేర్ చేయకుండా కరీనా...


అయితే కరీనా తన రెండో కొడుకు జెహ్ పుట్టిన తర్వాత పూర్తి ఫోటోను ఎప్పుడూ షేర్ చేయలేదు. ముఖాన్ని దాచి పెడుతూ పాక్షికంగా ఫోటోను షేర్ చేస్తూ అభిమానులను ఊరించారు. అయితే తాజాగా కూడా రక్షా బంధన్ వేడుకల్లో పూర్తి ఫోటోను కూడా షేర్ చేయలేదు. అయితే ఆ ఫోటో మాత్రం వైరల్‌గా మారింది.

కరీనా, సారా ఆలీ ఖాన్ ఇంట్లో రాఖీ వేడుకలు

కరీనా, సారా ఆలీ ఖాన్ ఇంట్లో రాఖీ వేడుకలు


కరీనా, సైఫ్ ఆలీ ఖాన్ దంపతులు సోహా ఆలీ ఖాన్ కుటుంబంతో రాఖీ పండుగను ఘనంగా జరుపుకొన్నారు. తన మేనల్లుడు జేహ్ ఆలీ ఖాన్‌కు తన కూతురు ఇనాయా నౌమీ కేము ముదుద పెట్టుకొంటున్న ఫోటోను సారా ఆలీ ఖాన్ ట్వీట్ చేశారు. దాంతో జేహ్ ఆలీ ఖాన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

జేహ్‌ను ముద్దు పెట్టుకొంటున్న ఇనయా..

జేహ్‌ను ముద్దు పెట్టుకొంటున్న ఇనయా..

అయితే సోహా ఆలీ ఖాన్ కూతురు ఇనాయా చిన్నారి జేహ్‌ను ముద్దు పెట్టుకొంటున్న దృశ్యాన్ని అందంగా, ముద్దు ముద్దుగా కెమెరాలో బంధించారు. కరీనా తన కుమారుడు జెహ్‌ను వెనుక వైపు నుంచి పట్టుకోగా.. ఇనాయా ప్రేమగా ముద్దు పెడుతూ కనిపించింది. కరీనా, సోహా పిల్లల ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

తైమూర్‌కు రాఖీ కడుతున్న ఇనయా..

తైమూర్‌కు రాఖీ కడుతున్న ఇనయా..

అలాగే సోహా ఆలీ ఖాన్ రక్షా బంధన్‌కు సంబంధించిన మరో ఫోటోను షేర్ చేశారు. కరీనా కపూర్ పెద్ద కుమారుడు తైమూర్ ఆలీ ఖాన్‌కు ఇనయా రాఖీ కడుతున్న ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెటిజ్లను విశేషంగా ఆకర్షించింది. తైమూర్‌కు రాఖీ కడుతుండగా సైఫ్, సోహ ఇద్దరు వారికి సహకరిస్తూ ఫోటోలో కనిపించారు. ఈ ఫోటోకు మంచి రెస్పాన్స్‌తోపాటు భారీగా లైకులు వచ్చాయి.

కరీనా కపూర్ కెరీర్ గురించి

కరీనా కపూర్ కెరీర్ గురించి

ఇక కరీనా కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు అంటే 2019లో గుడ్ న్యూస్ చిత్రంలో అక్షయ్ కుమార్ సరసన, అలాగే 2020 అంగ్రేజీ మీడియం చిత్రంలో ఇర్ఫాన్ పఠాన్ చిత్రంలో నటించింది. 2000 సంవత్సరంలో రెఫ్యూజీ చిత్రంతో అభిషేక్‌ బచ్చన్‌తో కలిసి నటించడం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60కిపైగా చిత్రాల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X