For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్మిమ్మింగ్ పూల్‌లో బికినీతో కనిపించిన కరీనా: తల్లైనా తగ్గని గ్లామర్ ట్రీట్.. మరిది పక్కనుండగానే!

  |

  దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాపై ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. అందానికి అందం.. అభినయానికి అభినయం.. గ్లామర్‌కు గ్లామర్ కలగలిపి ఉన్న ఈ నటీమణి.. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగం అయింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇక, వివాహం తర్వాత కూడా కెరీర్‌ను సాగిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్ సోషల్ మీడియాలో ఓ హాట్ బికినీ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. దానిపై మీరూ ఓ లుక్కుయండి!

  కరీనా కపూర్ కెరీర్ అలా మొదలైంది

  కరీనా కపూర్ కెరీర్ అలా మొదలైంది

  మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి 2000లో వచ్చిన ‘రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది కరీనా కపూర్. మొదటి మూవీలోనే అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లింది.

   సీనియర్ హీరోతో ప్రేమాయణం.. పెళ్లి

  సీనియర్ హీరోతో ప్రేమాయణం.. పెళ్లి

  వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే కరీనా కపూర్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అంతకంటే ముందు నుంచే అతడితో ప్రేమాయణం సాగించిన ఈ భామ.. కొన్నేళ్లకు అగ్నిసాక్షిగా అతడితో తాళి కట్టించుకుంది. అప్పట్లో ఇది బాగా హైలైట్ అయింది. దీని కారణం సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం కావడమే.

  కరీనా కొడుకు ఎప్పుడూ హాట్ టాపిక్

  కరీనా కొడుకు ఎప్పుడూ హాట్ టాపిక్

  సైఫ్ అలీ ఖాన్‌తో వివాహం జరిగిన నాలుగేళ్లకు కరీనా కపూర్ ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అతడి పేరు తైమూర్ అలీ ఖాన్. ఈ సినీ జంట ఎక్కడకు వెళ్లినా ఈ బుడ్డోడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు. అతడి ఫొటోలను తరచూ ఈ జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో బాగా పాపులర్ అయిపోయాడు. అతడికి తైమూర్ అని పేరు పెట్టినప్పుడు కూడా వివాదం అయింది.

   పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేస్తోంది

  పెళ్లి తర్వాత కూడా కంటిన్యూ చేస్తోంది

  వివాహం తర్వాత కూడా కరీనా కపూర్ సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక బంధం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ సీన్లలో నటించడంతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేసింది. ఈ క్రమంలోనే కొన్నింటిలో అద్భుతమైన ప్రదర్శన కూడా ఇచ్చింది. తద్వారా పలు అవార్డులను సైతం అందుకుని సత్తా చాటింది.

  కరోనాకు రెండో బిడ్డ... గర్భంతో కూడా

  కరోనాకు రెండో బిడ్డ... గర్భంతో కూడా

  కరీనా కపూర్ మొదటిసారి గర్భం దాల్చినప్పుడూ.. రెండో సారి ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడూ కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించి మెప్పింది. అప్పుడు ఆమె డెడికేషన్‌ను అందరూ ప్రశంసించారు. అదే సమయంలో విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉండగా.. కొద్ది రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సైఫ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

   ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తోంది

  ఎప్పుడూ అందులోనే.. రచ్చ చేస్తోంది

  కరీనా కపూర్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతుంది. తద్వారా ఆమెకు ఫాలోవర్లు పెరుగుతున్నారు.

  Prabhas ఫేవరెట్ డైరెక్టర్ ఆయనే.. ఆ సినిమాలు 20 సార్లు చూసాడట!! || Filmibeat Telugu
   బికినీ ఫొటోతో షాకిచ్చి కరీనా కపూర్

  బికినీ ఫొటోతో షాకిచ్చి కరీనా కపూర్

  సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉండే కరీనా కపూర్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బికినీ ఫొటోను షేర్ చేసింది. అందులో స్మిమ్మింగ్ పూల్‌లో ఆమెతో పాటు భర్త సైఫ్ అలీ ఖాన్, పెద్ద కొడుకు తైమూర్ అలీ ఖాన్‌తో పాటు కరీనా మరిది కూడా ఉన్నాడు. అతడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ ఫొటోను షేర్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పిక్‌ వైరల్ అవుతోంది.

  English summary
  Bollywood Senior Heroine Kareena Kapoor Very Active in Social Media. Now She Shared A Bikini Photo in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X