For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ..

  |

  సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, వారిలో కొందరు మాత్రం ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు దక్కించుకుంటారు. తద్వారా స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే హీరోయిన్‌గా పరిచయమైన ఆమె.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది. తద్వారా నేషనల్ లెవెల్‌లో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

  ఇక, సైఫ్ అలీ ఖాన్‌తో వివాహం తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించని ఈ సుందరాంగి.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే కరీనా కపూర్ తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి!

  Bigg boss 5 Telugu: కంటెస్టెంట్ గా రానున్న TV9 యాంకర్ ప్రత్యూష.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

  అక్కడి నుంచి ఇక్కడి.. స్టార్ హీరోయిన్‌గా

  అక్కడి నుంచి ఇక్కడి.. స్టార్ హీరోయిన్‌గా

  సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే మోడల్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది కరీనా కపూర్. అందులో తన అందంతో అందరినీ మాయ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గా వ్యవహరించింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన ‘రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది.

  మొదటి మూవీలోనే అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. అలా బాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. తద్వారా బడా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

  Sai Pallavi తో నాగచైతన్య కెమిస్ట్రీ అదుర్స్.. వెండితెర మీద ఇక సారంగ ధరియే!

  స్టార్ హీరోకు రెండో భార్యగా కరీనా కపూర్

  స్టార్ హీరోకు రెండో భార్యగా కరీనా కపూర్

  హిందీలోనే కాకుండా కరీనా కపూర్‌కు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇలా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత కొన్నేళ్లకు తన ప్రేమను బయట పెట్టుకుంది. అది జరిగిన కొన్ని రోజులకు ఈ సీనియర్ స్టార్ హీరోతో అగ్నిసాక్షిగా తాళి కట్టించుకుంది. అప్పట్లో ఇది బాగా సంచలనం అయిపోయింది. దీనికి కారణం సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం కావడమే. దీనిపై కరీనా కపూర్ అభిమానులు నిరాశ చెందారు కూడా.

  Shruti Haasan హాట్ హాట్‌గా.. ముంబైలో బ్యూటీ ఇల్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే!

  బ్రేక్ లేకుండా చేస్తూనే ఉన్న హాట్ బ్యూటీ

  బ్రేక్ లేకుండా చేస్తూనే ఉన్న హాట్ బ్యూటీ

  చాలా మంది హీరోయిన్లు వివాహం తర్వాత సినిమా రంగానికి దూరంగా ఉంటుంటారు. కానీ, కరీనా కపూర్ మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక బంధం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ సీన్లలో నటించడంతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేసింది. ఈ క్రమంలోనే కొన్నింటిలో అద్భుతమైన ప్రదర్శన కూడా ఇచ్చింది. తద్వారా పలు అవార్డులను సైతం అందుకుందీ బ్యూటీ. అలాగే, హోమ్ ప్రొడక్ట్‌లకు బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తూ ఫుల్లుగా ఆర్జిస్తోంది.

  రెండో బిడ్డ పేరు వివాదం.. బీ టౌన్‌లో రచ్చ

  రెండో బిడ్డ పేరు వివాదం.. బీ టౌన్‌లో రచ్చ

  సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్ అందరికీ సుపరిచితుడు అయిపోయాడు. ఇక, ఈ మధ్యనే పుట్టిన రెండో కుమారుడికి ‘జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఓ ఉగ్రవాది పేరును వాళ్ల కుమారుడికి పెట్టుకోవడంపై కరీనా, సైఫ్ దంపతులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా ఈ వివాదం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

  అందులో మాత్రం సందడి చేస్తూనే ఉంటూ

  అందులో మాత్రం సందడి చేస్తూనే ఉంటూ

  చాలా కాలంగా సినీ రంగంలో వరుస సినిమాలు చేసిన కరీనా కపూర్.. తన అభిమానులు బిగ్ స్క్రీన్ మీద అలరించేది. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె మూవీలకు దూరంగా ఉంటోంది. దీంతో సోషల్ మీడియాను వాడుకుని ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతుంది. మరీ ముఖ్యంగా తన కుమారులకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది.

  ఈ మధ్య మరింత ఎక్కువగా గ్లామర్ ట్రీట్

  ఈ మధ్య మరింత ఎక్కువగా గ్లామర్ ట్రీట్

  సుదీర్ఘ కాలంగా కరీనా కపూర్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోది. ఈ క్రమంలోనే అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ ఖాతాలను తెరుచుకుంది. వీటిలో అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. దాని తర్వాత కూడా అదే తీరుగా వ్యవహరిస్తోంది. అంతెందుకు ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ షో చేస్తోంది. అంతేకాదు, గర్భంతో ఉన్నప్పుడు కూడా బోల్డుగా కనిపించింది. దీంతో కరీనాపై విమర్శలు కూడా వచ్చాయి. కానీ, ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు.

  Who is Rajiv Kapoor ? | Rajiv Kapoor Service To Bollywood
  బ్రాతో దిగిన ఫొటోతో రచ్చ చేస్తున్న కరీనా

  బ్రాతో దిగిన ఫొటోతో రచ్చ చేస్తున్న కరీనా

  కరీనా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను స్టోరీగా పెట్టుకుంది. ఇందులో ఆమె కేవలం బ్రా ఒక్కటే ధరించి ఉంది. అంతేకాదు, క్లోజ్‌గా తీసుకున్న ఈ ఫొటోలో ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ఇక, ఇందులో తాను బీచ్ దగ్గర ఉన్నట్లు ఆమె పేర్కొంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇద్దరు బిడ్డల తల్లైనా గ్లామర్ షోలో తగ్గేదే లేదు అన్నట్లుగా హాట్ హాట్ ఫొటోలు వదులుతుండడంపై కొందరు కరీనాపై విమర్శలు చేస్తున్నారు.

  English summary
  Bollywood Senior Heroine Kareena Kapoor Very Active in Social Media. Now She Shared A Hot Bikini Selfie in her Instagram. This Pics Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X