For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బోల్డు షోతో కరీనా కపూర్ రచ్చ: ఏకంగా అలాంటి సెల్ఫీ.. ఘాటు ఫోజుతో పడుకుని మరొకటి!

  |

  కరీనా కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ బ్యూటీ తన అందచందాలతో పాటు అద్భుతమైన నటనతో ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇలా దాదాపు రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీలో సత్తా చాటి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలతోనూ నటించి హవాను చూపించింది.

  ఇక, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న కరీనా.. ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. దీంతో సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంటోంది. అయనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే తాజాగా కరీనా కపూర్ కొన్ని హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. వాటిపై మీరూ ఓ లుక్కేయండి!

  అలా మొదలైన ప్రయాణం.. స్టార్‌గా ఎదిగి

  అలా మొదలైన ప్రయాణం.. స్టార్‌గా ఎదిగి

  సినిమాల్లోకి ప్రవేశించాలన్న పట్టుదలతో కరీనా కపూర్ మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తన అందచందాలతో చాలా కాలం పాటు ఆ రంగంలో సత్తా చాటిన ఆమె.. 2000లో వచ్చిన ‘రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయింది.

  మొదటి మూవీలోనే అద్భుతమైన నటనతో ఎన్నో అవార్డులు దక్కించుకోవడంతో పాటు ఆఫర్లను కూడా అందుకుంది. తద్వారా స్టార్ అయింది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ ఆడిపాడింది. అలాగే, పలు భాషల చిత్రాల్లోనూ నటించి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

  ఘాటు వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల ఆరబోత

  పెళ్లైన స్టార్‌తో కరీనా ప్రేమ.. సంచలనంగా

  పెళ్లైన స్టార్‌తో కరీనా ప్రేమ.. సంచలనంగా

  వరుస సినిమాలతో కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే స్టార్ హీరోయిన్ కరీనా కపూర్.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమాయణం సాగించింది. ఇలా చాలా కాలం పాటు అతడితో డేటింగ్ చేసిన ఈ బ్యూటీ.. కొన్నేళ్లకు తన ప్రేమను బయట పెట్టుకుంది.

  అది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఈ సీనియర్ స్టార్ హీరోతో అగ్నిసాక్షిగా తాళి కట్టించుకుంది. అప్పట్లో ఇది బాగా సంచలనం అయిపోయింది. దీనికి కారణం సైఫ్ అలీ ఖాన్‌కు ఇది రెండో వివాహం కావడమే. అప్పట్లో కరీనా కపూర్ అభిమానులు ఈ విషయంపై ఆందోళనలు కూడా వ్యక్తం చేశారు.

  కెరీర్‌ను మాత్రం ఆపకుండా.. కరీనా సత్తా

  కెరీర్‌ను మాత్రం ఆపకుండా.. కరీనా సత్తా

  సాధారణంగా హీరోయిన్లకు వివాహం జరిగితే.. వాళ్ల కెరీర్‌లకు పుల్‌స్టాప్‌లు పెట్టేస్తుంటారు. కానీ, కరీనా కపూర్ మాత్రం పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. తద్వారా వైవాహిక బంధం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది. అంతేకాదు, వివాహం జరిగిన తర్వాత కూడా కొన్ని హాట్ సీన్లలో నటించడంతో పాటు గ్లామర్ రోల్స్ కూడా చేసింది.

  ఈ క్రమంలోనే కొన్నింటిలో అద్భుతమైన ప్రదర్శన కూడా ఇచ్చింది. తద్వారా పలు అవార్డులను సైతం అందుకుందీ బ్యూటీ. అలాగే, ఫ్యామిలీకి సంబంధించిన ప్రొడక్ట్‌లకు బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తోంది.

  ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ అరెస్ట్: ఆ ఫొటో షేర్ చేయడంతో కేసు.. విషయం చెప్పి బాధ పడిన స్టార్

  కరీనాకు రెండో బిడ్డ.. వివాదంగా మారింది

  కరీనాకు రెండో బిడ్డ.. వివాదంగా మారింది

  సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్ అందరికీ సుపరిచితుడు అయిపోయాడు. అతడి పేరు సైతం ఎంతో కాలం పాటు చర్చనీయాంశం అయింది.

  ఇక, ఇప్పుడు రెండో కుమారుడికి ‘జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. దీంతో ఇది పెద్ద వివాదంగా మారింది. ఓ ఉగ్రవాది పేరును వాళ్ల కుమారుడికి పెట్టుకోవడంపై కరీనా, సైఫ్ దంపతులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇది రచ్చ రచ్చ అవుతోంది.

   అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా ఉంటూ

  అప్పట్లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఇంట్లోనే సమయం గడుపుతున్నప్పటికీ కరీనా కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తనకు, తన కుటుంబ సభ్యులకు చెందిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతుంది. మరీ ముఖ్యంగా తన కుమారులకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తోంది. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ అయిపోతోంది.

  తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

  బోల్డు షోతో రెచ్చిపోయిన హీరోయిన్ కరీనా

  బోల్డు షోతో రెచ్చిపోయిన హీరోయిన్ కరీనా

  సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కరీనా కపూర్.. అప్పుడప్పుడూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ హాట్ ఫొటోలను వదిలింది. వాటిలో ఆమె క్లీవేజ్ షో చేస్తూ కుర్రకారును రెచ్చగొడుతోంది. సెల్ఫీ తీసుకున్న ఒక పిక్‌లో కరీనా ఎద అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. అలాగే, మరో ఫొటోలో శవాసనం వేసి కనిపించింది. ఇందులో కూడా ఆమె అందాలు ఆరబోసింది. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో భారీ రెస్పాన్స్ వస్తోంది.

  Sanjana Galrani About Swarna Khadgam Serial | Interview Part 2
  ఆమెను అలా చూసి షాక్ అవుతోన్న ఫ్యాన్స్

  ఆమెను అలా చూసి షాక్ అవుతోన్న ఫ్యాన్స్

  రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కరీనా కపూర్ పెద్దగా బయటకు రావడం లేదు. అలాగే, సోషల్ మీడియాలోనూ పాత ఫొటోలను షేర్ చేసింది. అయితే, ఇప్పుడు వదిలిన ఫొటోలు మాత్రం తాజాగా తీసుకున్నవే. మొన్నటి వరకూ ఎంతో బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ వీటిలో మాత్రం కొంచెం స్లిమ్‌గా దర్శనమిస్తోంది. దీంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరు బిడ్డల తల్లైనా గ్లామర్ షోలో తగ్గేదే లేదు అన్నట్లుగా హాట్ హాట్ ఫొటోలు వదులుతుండడంపై కొందరు కరీనా కపూర్‌పై విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ అమ్మడి పేరు హైలైట్ అవుతోంది.

  English summary
  Bollywood Senior Heroine Kareena Kapoor Very Active in Social Media. Now She Shared A Hot and Workout Photos in her Instagram. These Pics Gone Viral.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X