టాప్ విప్పేసి రెచ్చిపోయిన కరీనా: ఇద్దరు బిడ్డల తల్లైనా ఘోరంగా ఫోజులు

బాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లు సందడి చేశారు.. చేస్తున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే దేశ వ్యాప్తంగా హవాను చూపించి నేషనల్ స్టార్లుగా వెలుగొందుతున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఒకరు. అందానికి అందం.. నటనకు నటన కనబరుస్తూ విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. చాలా కాలం పాటు స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుని అందరికీ షాకిచ్చేసింది. అయితే, పెళ్లి తర్వాత పెద్దగా సినిమాలు చేయని కరీనా కపూర్.. సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ సీనియర్ హీరోయిన్ కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అలా వచ్చింది.. పాపులర్ అయింది

అలా వచ్చింది.. పాపులర్ అయింది

టీనేజ్‌లోనే మోడలింగ్ రంగంలో తనదైన అందచందాలతో కరీనా కపూర్ సందడి చేసింది. ఈ క్రమంలోనే 'రెఫూగీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది. అప్పటి నుంచి ఏమాత్రం వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్లింది. ఇక, సుదీర్ఘమైన కెరీర్‌లో ఈ బ్యూటీ ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

స్టార్ హీరోకు రెండో భార్యగా బ్యూటీ

స్టార్ హీరోకు రెండో భార్యగా బ్యూటీ

బాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తోన్న సమయంలోనే కరీనా కపూర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో ప్రేమాయణం సాగించింది. ఆ తర్వాత ఆయననే ఈ అమ్మడు వివాహం కూడా చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం సంచలనం అయింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

పెళ్లైన తర్వాత కూడా కంటిన్యూనే

పెళ్లైన తర్వాత కూడా కంటిన్యూనే

సాధారణంగా సినిమా రంగానికి చెందిన వాళ్లు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లను ముగిస్తుంటారు. కానీ, సైఫ్‌తో పెళ్లైన తర్వాత కూడా కరీనా కపూర్ తన ప్రయాణాన్ని ఆపలేదు. అంతేకాదు, తల్లైన తర్వాత కూడా సినిమాలు చేస్తూ వచ్చింది. అలాగే, ఎన్నో యాడ్స్‌లో నటించింది. తద్వారా వైవాహిక జీవితం కెరీర్‌కు ఏమాత్రం అడ్డు కాబోదని నిరూపించింది.

ఇద్దరు పిల్లల తల్లి.. ఒక సినిమానే

ఇద్దరు పిల్లల తల్లి.. ఒక సినిమానే

సీనియర్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లాడిన తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్, రెండో కుమారుడికి 'జహంగీర్' అని కరీనా దంపతులు పేరు పెట్టారు. ఇక, ఇప్పుడు ఈ సీనియర్ హీరోయిన్ చేతిలో ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' మూవీ మాత్రమే ఉంది.

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

సోషల్ మీడియాలో యమ యాక్టివ్

పెళ్లికి ముందు వరకూ సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ ముందుకు సాగుతోంది. తద్వారా తన క్రేజ్ పెంచుకుంటోంది.

అందాలతో రెచ్చగొడుతోన్న భామ

అందాలతో రెచ్చగొడుతోన్న భామ

సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ అందాలను కూడా ఆరబోస్తోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం తగ్గట్లేదు. ఇక, కరీనా కపూర్ హాట్ ట్రీట్‌కు ఇంటర్నెట్ ఊగిపోయేలా రెస్పాన్స్ దక్కుతోంది.

హాట్ ఫొటోలను షేర్ చేసిన కరీనా

హాట్ ఫొటోలను షేర్ చేసిన కరీనా

కరీనా కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లేజర్‌ను విప్పేసి లోదుస్తులతో కనిపించింది. అలాగే, నడుము అందాలను చూపిస్తూ తెగ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోలలో ఆమె అందాలు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌లకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కి.. విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X