డ్రెస్ తీసేసి మరీ కరీనా కపూర్ రచ్చ: అబ్బో ఆ ఫోజు చూశారంటే!
ఇండియాలో చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుని నేషనల్ రేంజ్‌లో హవాను చూపించారు. తద్వారా సుదీర్ఘ కాలం పాటు బిగ్ స్టార్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో బాలీవుడ్ భామ కరీనా కపూర్ ఒకరు. ఆకట్టుకునే అందం.. మైమరపించే నటనతో చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈ సుందరి.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో సినిమాల మీద సినిమాలు చేసింది. అయితే, వివాహం తర్వాత స్పీడు తగ్గించేసింది. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిత్యం మజాను పంచుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే ఓ లుక్కేయండి మరి!

బాలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరోయిన్
చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను మొదలు పెట్టిన కరీనా కపూర్.. 'రెఫూగీ' అనే సినిమాతో బాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత పెద్ద పెద్ద ఆఫర్లను దక్కించుకుని స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రికార్డులు సొంతం చేసుకుని నేషనల్ రేంజ్ క్రేజ్ అందుకుంది.

బడా హీరోకు రెండో భార్యగా కరీనా
బాలీవుడ్‌లో బడా స్టార్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే కరీనా కపూర్.. సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్‌తో లవ్ ట్రాక్ నడిపింది. ఆ తర్వాత ఆయననే ఈ భామ పెళ్లి చేసుకుంది. అంత స్టార్‌డమ్ ఉన్న హీరోయిన్ ఒకరికి రెండో భార్యగా వెళ్లడం అనేది అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపై కరీనా ఫ్యాన్స్ అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ న్యూస్ హైలైట్ అయింది.

కెరీర్ ఆపకుండా... వాటిని చేస్తూ
సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కూడా కరీనా కపూర్ తన కెరీర్‌కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వలేదు. పెళ్లి తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ భామ.. గర్భంతో ఉన్న సమయంలోనూ, తల్లైన తర్వాత కూడా కొన్ని వ్యాపార ప్రకటనల్లో నటించింది. అలాగే, కొన్ని బ్రాండ్లకు ప్రచారకర్తగానూ చేస్తోంది. తద్వారా వివాహమైనా కెరీర్‌ను కొనసాగిస్తూ ఎంతో మంది ఆదర్శంగా ఉంటోంది.

ఇద్దరికి తల్లైంది.. ఒక్క సినిమానే
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకున్న తర్వాత కరీనా కపూర్ తన వైవాహిక జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చింది. మొదటి సంతానంగా తైముర్, రెండో కుమారుడికి 'జహంగీర్' అని ఈ దంపతులు పేరు పెట్టారు. ఇక, ఇప్పుడు కరీనా కపూర్.. ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో కరీనా రచ్చ
అప్పట్లో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. కొంత కాలంగా వెండితెరపై పెద్దగా సందడి చేయకున్నా.. కరీనా కపూర్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటోంది. తద్వారా తన క్రేజ్ పెంచుకుంటూ తెగ హైలైట్ అయిపోతోంది.

అప్పుడప్పుడూ అందాల విందు
ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న కరీనా కపూర్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ కాక రేపుతోంది. ఇందులో భాగంగానే తరచుగా గ్లామరస్ ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. పెళ్లికి ముందు బోల్డుగా ఉన్న ఈ అమ్మడు.. ఇద్దరు బిడ్డల తల్లైనా కూడా ఏమాత్రం రెచ్చిపోతోంది. ఇలా కొంత కాలంగా కరీనా తన గ్లామర్ ట్రీట్‌తో తరచూ వార్తల్లో నిలుస్తోంది.

ఒకప్పటి హాట్ ఫొటో వదిలిందిగా
తాజాగా కరీనా కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హీరోయిన్‌గా హవాను చూపిస్తోన్న సమయంలో తీసుకున్న ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్‌ను విప్పేసి లోదుస్తులతో కనిపించింది. దీంతో ఈ పిక్‌లో ఆమె అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. విపరీతంగా వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











