పుట్టినరోజు డ్రెస్ కోసం కరీనా ఖర్చు ఎంతో తెలుసా!
బాలీవుడ్ బెబో కరీనా కపూర్ ఇటీవలే 40వ పడిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కరీనా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇలా నాలుగు పదుల వయసుకు చేరుకోవడం విశేషం. తాజాగా సోమవారం పుట్టిన రోజు తన పుట్టిన రోజుని జరుపుకుంది కరీనా. కేవలం కుటుంబ సభ్యుల మధ్య సింపుల్‌గా బర్త్ డే వేడుక జరిగింది.
ముంబయిలో తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో భర్త సైఫ్ అలీఖాన్, సోదరి కరిష్మా కపూర్, తండ్రి రణ్‌ధీర్ కపూర్, తల్లి బబితా పాల్గొన్నారు. మామూలుగానే కరీనా ఫ్యాషన్ కు పెద్ద పీట వేస్తుంది . ఇలా స్పెషల్ డే రోజు తన అందం మరింత రెట్టింపు అయ్యే డిజైనర్ డ్రెస్ లో కళ్ళు చెదిరేలా కనువిందు చేసింది. మసాబా కోచర్ స్కర్ట్-అండ్-టాప్ కాంబో డ్రెస్ ను ధరించింది.

డ్రెస్ ఆ రేంజ్ లో ఉంటే దాని ధర కూడా అదే రేంజులో ఉంటుంది కదా .. ఈ డిజైనర్ దుస్తుల ఖర్చుతో ఓ హైటెక్ వైర్ లెస్ హెడ్ ఫోన్స్ కొనొచ్చాట . ఈ డ్రెస్ రంగురంగుల పూల డిజైన్లతో ఆకర్షణీయంగా ఉండటంతో పాటూ ఫ్యాషన్ లవర్స్ ను ఇట్టే ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











