రెండో పెళ్లిపై ఓపెన్ అయిన కరిష్మా కపూర్.. త్వరలో కపూర్ ఫ్యామిలీలో పెళ్లి భాజాలు?

ఇటీవల కపూర్ కుటుంబంలో పెళ్లి బాజాలు మోగాయి. చాలా కాలం నుండి ప్రేమలో ఉన్న రణబీర్ -ఆలియా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు త్వరలో ఈ కుటుంబంలో మరో సారి పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఈసారి అది కరిష్మా కపూర్ కోసం అని తెలుస్తోంది. ఇటీవల, కరిష్మా కపూర్ తన పెళ్లి గురించి అభిమానులతో ఓపెన్ అయింది. వారితో ఇంటరాక్షన్ సెషన్ లో తన రెండో పెళ్లి గురించి ఆమె ఓపెన్ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే

'ఆస్క్ మి ఎనీథింగ్'

'ఆస్క్ మి ఎనీథింగ్'

నటి కరిష్మా కపూర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చింది. కరిష్మా కపూర్ ఇన్‌స్టాలో 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌ నిర్వహించగా ఈ సెషన్‌ లో భాగంగా ఆమె అభిమానులు ఆమెను చాలా ఫన్నీ అలాగే కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు కూడా అడిగారు. అయితే దాదాపు ఆమె వాటిలోని అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ సెషన్‌ లో , అందరూ కరిష్మా కపూర్‌ను ఆమెకు ఇష్టమైన ఆహారం, ఇష్టమైన నటీనటులు ఎవరు, ఇష్టమైన రంగు గురించి అడిగారు.

ఇక ఒకరు అయితే ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటారా అని కూడా అడిగారు. ఈ 'ఆస్క్ మి ఎనీథింగ్' సెషన్‌లో, కరిష్మా కపూర్‌ను రణబీర్ కపూర్ లేదా రణవీర్ సింగ్‌లలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు అని అడగగా ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ 'ఇద్దరూ ఇష్టమే' అని చెప్పింది. అంతే కాక ఈ 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో కరిష్మా తనకు ఇష్టమైన ఆహారం బిర్యానీ అని కూడా చెప్పింది. అదే సమయంలో, ఆమె తనకు ఇష్టమైన రంగు నలుపు అని కూడా ఆమె చెప్పింది.

 పెళ్లి చేసుకుంటారా? అని

పెళ్లి చేసుకుంటారా? అని

ఇక ఈ 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్లో ఆమె అభిమాని ఒకరు నటిని చాలా పర్సనల్ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా, కరిష్మా ఒక అమ్మాయి ఫోటో ఉన్న gifని షేర్ చేసింది. అలా షేర్ చేయడమే కాక దాని మీద 'డిపెండ్స్' అంటూ రాసుకోచ్చింది. అంటే ఆమె చేసుకోను అని చెప్పలేదు, అలాగే చేసుకుంటాను అని కూడా చెప్పలేదు. పరిస్థితులను బట్టి ఆధార పడి ఉంటుంది అని చెప్పుకొచ్చింది.

గతం కంటే భిన్నంగా

గతం కంటే భిన్నంగా

అయితే కరిష్మా గతంలో మాట్లాడిన విషయాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇది కొంచెం ఆసక్తికరంగానే ఉంది ఎందుకంటే ఆమె గతంలో ఎప్పుడూ రెండో పెళ్లి గురించి ఎలాంటి కామెంట్ చేయలేదు. కపూర్ ఫ్యామిలీకి చెందిన కరిష్మా ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను 2003లో వివాహం చేసుకుంది.

పిల్లలు కూడా

పిల్లలు కూడా

ఈ క్రమంలోనే ఈ జంటకు కుమార్తె అదారా, కుమారుడు కియాన్ ఉన్నారు. అయితే, 2014 సంవత్సరం నాటికి, కరిష్మా - సంజయ్ మధ్య దూరం పెరగడంతో 2016 సంవత్సరంలో, కరిష్మా సంజయ్ విడాకులు తీసుకున్నారు. ఇక విడిపోయిన సమయంలో వారిద్దరూ ఒకరిపై ఒకరు చాలా తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. ఈ కారణంగా వారి విడాకులు అప్పట్లో వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X