అందానికి తలవంచిన చిరుత.. భయంతో టాప్ హీరోయిన్ గజగజ.. ఏం జరిగిందంటే?
బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కరిష్మా కపూర్ అగ్ర హీరోలందరితో నటించి మెప్పించింది. కెరీర్ గ్రాఫ్ రివ్వును దూసుకెళ్తున్న సమయంలోనే అభిమానులకు షాకిస్తూ పెళ్లి చేసుకొన్నది. ఆ తర్వాత క్రమంగా సినీ పరిశ్రమకు దూరమైన ఆమె మళ్లీ ఇప్పుడు తన జాతకాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో కొన్ని వెబ్ సిరీస్, సినిమాలపై దృష్టిపెట్టారు. తాజాగా ఆమె గతంలో నటించిన ఈ సినిమా తాలుకు మధుర స్మృతులను ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. ఆ విషయాలను చెబుతూ..

కపూర్ వంశం నుంచి బాలీవుడ్‌లోకి
బాలీవుడ్‌లో దిగ్గజాలైన రాజ్ కపూర్, రణ్‌ధీర్ కపూర్లు ఉన్న కుటుంబం నుంచి కరీనా కపూర్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అనతికాలంలోనే తన అందం, అభినయంతో మెప్పించి అగ్రతారగా నిలబడింది. షారుఖ్ ఖాన్ లాంటి టాప్ హీరోలందరితోనూ నటించారు. గోవిందాతో కలిసి చేసిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

పెళ్లి తర్వాత విడాకులు
అయితే చోటా మియా, జూనియర్ బచ్చన్ అభిషేక్ బచ్చన్‌తో పెళ్లి వ్యవహారం బెడిసికొట్టింది. బచ్చన్ కోడలు అవుదామని ఆశపడిన కరీనా కపూర్ భంగపాటుకు గురయ్యారు. ఆ తర్వాత పెళ్లి జరిగిన అభిప్రాయ బేధాల కారణంగా విడాకుల పొందారు. ప్రస్తుతం మళ్లీ బాలీవుడ్‌లో అడుగుపెట్టేందుకు కరీనా ప్రయత్నాలు ప్రారంభించారు.

షికారి చిత్ర షూట్‌లో అలా
ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో కరీనా కపూర్ తన పాత చిత్రానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. 2000లో గోవిందాతో కలిసి నటించిన షికారి చిత్ర షూటింగు సందర్భంగా చిరుతతో కలిసి నటించిన సన్నివేశాన్ని గుర్తు చేసుకొన్నారు. ఇది నా త్రో బ్యాక్ ఫోటో అంటూ ఫ్రైడే ఫ్లాష్ బ్యాక్ అంటూ ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

కంప్యూటర్ గ్రాఫిక్స్ కాదు..
చిరుతతో దిగిన ఫోటో గురించి కరీనా కపూర్ తెలియజేస్తూ.. ఇది కంప్యూటర్ జనరేట్ చేసిన ఫోటో కాదు. వీఎఫ్ఎక్స్‌తో చేసిన ఫోటో కాదు. అందమైన చీటా నేను ఒకే ఫ్రేమ్‌లో ఉన్న నిజమైన ఫోటో. వాస్తవానికి ఆ సమయంలో భయపడ్డాను. కానీ ఆ క్షణాలు మరిచిపోలేని విధంగా హృదయంలో నిలిచిపోయాయి. దక్షిణాఫ్రికాలో జరిగిన షూటింగ్ క్షణాలు ఇప్పటికీ నాకు బాగా గుర్తుంది అని తెలిపారు.
Recommended Video

వెబ్ సిరీస్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు
ఇక వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలకు వస్తే.. కరిష్మ కపూర్ ప్రస్తుతంల లాక్‌డౌన్ కారణంగా క్వారంటైన్ జీవితాన్ని తన ఇద్దరు పిల్లలు సమీరా కపూర్, కియాన్ రాజ్ కపూర్‌తో గడుపుతున్నారు. ఇటీవల ఆమె నటించిన మెంటల్‌హుడ్ వెబ్ సిరీస్ జీ5లో ప్రసారం అవుతున్నది. మరికొన్ని వెబ్ సిరీస్, సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.


Click it and Unblock the Notifications











