ఒకప్పటి చిరంజీవి హీరోయిన్.. 40 ఏళ్ళ వయసులో బికినీ ట్రీట్.. డైరెక్ట్ గా ఇన్నర్ వేర్ కనిపించేలా..
సినిమా ప్రపంచంలో చాలామంది హీరోయిన్స్ కాలానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. ముఖ్యంగా మోడలింగ్ నుంచి వచ్చిన హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బికినీ అందాలతో ఎప్పటికప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటారు. వయసు పెరుగుతున్నా కూడా గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గదు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాతో ఒకప్పుడు గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన ఒక హీరోయిన్ ఇప్పుడు 40 ఏళ్ళ వయసులో కూడా బికినీ అందాలతో షాక్ ఇస్తుంది. ఆ హీరోయిన్ అందాల వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ సినిమాతో లక్కీ ఛాన్స్
కరిష్మా కోటక్.. 2007లో ఈ పేరు సౌత్ ఇండస్ట్రీలో కాస్త బాగానే వైరల్ అయింది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా సీక్వెల్ మూవీ శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో అవకాశం దక్కించుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచింది. ఈ బ్యూటీ చాలా అదృష్టవంతురాలు అని అందరూ అనుకున్నారు. ఆ సినిమాలో అమ్మడు చాలా అందంగా కనిపించింది.

ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినా..
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చే ముందు చేసిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా అంతగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేక పోయింది. కానీ ఇందులో నటించిన కరిష్మా కోటక్ మాత్రం మంచి గుర్తింపు అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా తమిళం అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆమె పేరు బాగానే వినిపించింది. వెంటనే ఆ తర్వాత ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా బిజీ అయిపోయింది.

ఏమాత్రం నిరాశ చెందకుండా
కరిష్మా కోటక్ కేవలం సినిమాలతోనే కాకుండా రియాలీటి షోలలో కూడా తన డాన్స్ టాలెంట్ తో మెప్పించే ప్రయత్నం చేసింది. ఇక ఒకానొక సమయంలో చాలా వరకు అవకాశాలు తగ్గాయి. అయితే అవకాశాలు తగ్గినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా కొన్ని చిన్న సినిమాల్లో కూడా నటించే ప్రయత్నం చేసింది. లక్నోవి ఇష్క్, లవ్ అఫైర్ హిందీ సినిమాలతో ఆమె నటిగా మంచి గుర్తింపు అందుకుంది.

బాగానే పోటీని ఇచ్చినప్పటికీ..
ఇక సినిమాలలో అవకాశాలు తగ్గిన తర్వాత కరిష్మా కోటాక్ రియాల్టీ షోలలో మరింత బిజీ అయ్యే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్ 6వ సీజన్ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొంది. కానీ అందులో ఆమె ఎక్కువకాలం కొనసాగ లేకపోయింది. బాగానే పోటీని ఇచ్చినప్పటికీ కూడా తొందరగానే హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక తర్వాత మరికొన్ని డాన్స్ రియాల్టీ షోలలో కూడా కరిష్మా తన టాలెంట్ ను బయట పెట్టుకుంది.

40లో బికినీ ఫొటోలతో షాక్
ఇక కరిష్మా కోటక్ వయసు 40 ఏళ్ళు దాటినా కూడా ఇంకా పాతికేళ్ల హీరోయిన్ తరహాలోనే గ్లామర్ తో ఎంతగానో కట్టుకుంటుంది. ఆమెకు సంబంధించిన బికినీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా ఆమె బికినీ ఫోటోలను పోస్ట్ చేసింది. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియాలో అంతకంటే ఘాటైన బికినీ లుక్స్ తో ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఈ గ్లామర్ తో అమ్మడు ఏవైనా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.

అలా కొనసాగుతున్న కరిష్మా
ఇక కరిష్మా కోటక్ సినిమాల్లో ప్రయత్నాలు చేసిన తర్వాత టెలివిజన్ లో కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ కు ఆమె ప్రత్యేకంగా యాంకరింగ్ కూడా చేశారు. టీవీ ప్రెసెంటర్ గా ఎన్నో స్పోర్ట్స్ ఈవెంట్స్ లో ఆమె పాల్గొన్నారు. ముఖ్యంగా ఐపీఎల్ ఈవెంట్స్ కు చాలాసార్లు టీవీ ప్రెసెంటర్ గా కొనసాగారు. ఇక ఇప్పుడు కూడా కరిష్మా టీవీ ప్రెసెంటర్ గానే పలు స్పోర్ట్స్ ఛానల్స్ లో వర్క్ చేస్తున్నారు


Click it and Unblock the Notifications











