45 ఏళ్లలో ఇంత హాట్‌గానా? బికినీలో మతిపొగొడుతున్న హీరోయిన్.. భర్తతో విడాకుల తర్వాత..
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ ప్రస్తుతం మంచి జోష్‌లో కనిపిస్తున్నట్టుంది. భర్తతో విడాకుల తర్వాత ఇప్పుడిప్పుడే జీవితంలో గాడిలో పడుతున్నట్టు స్పష్టమవుతున్నది. మంగళవారం 45వ జన్మదినం జరుపుకొన్న కరిష్మా హాట్ హాట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటో కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వైరల్‌గా మారింది. అంతేకాకుండా కరిష్మ అందాల గురించి బాలీవుడ్‌లో చర్చ కూడా జరుగుతున్నదట. ఈ ఫొటో వెనుక అసలు కథ ఏమిటంటే..

లండన్‌లో విహార హంగామా
ప్రస్తుతం కరిష్మా కపూర్ తన సోదరి కరీనా కపూర్, సైఫ్ ఆలీ ఖాన్, వారి కుమారుడు తైమూర్‌తో కలిసి లండన్‌లో విహరిస్తున్నది. తన సోదరి కుటుంబంతో కలిసి జన్మదినాన్ని ఘనంగా జరుపుకొన్నది. ఈ సందర్భంగా బ్లాక్ బికినీలో సెక్సీగా కనిపించింది. స్విమ్మింగ్ పూల్‌నే కాదు.. లండన్ వాతావరణాన్ని వేడెక్కించింది.

వయసు ముఖ్యంగా కాదని
హాట్ అండ్ సెక్సీ ఫొటోను కరిష్మ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులతో పంచుకొన్నది. మనిషికి వయసు ముఖ్యం కాదు. ఏ వయసులోనైనా నిన్ను నీవు ప్రేమించుకో. మనసులో ఎలాంటి ఫిల్టర్లు పెట్టుకోకు. ఇది నా బర్త్ డే మూడ్ అంటూ కరిష్మా ఓ మెసేజ్‌ను పెట్టింది. ఈ ఫోటోపై నెటిజన్లు విరుగబడి కామెంట్లు గుప్పిస్తున్నారు.

16వ ఏటనే బాలీవుడ్‌లోకి
కరిష్మ కెరీర్ విషయానికి వస్తే, 16వ ఏటనే బాలీవుడ్‌లో ప్రవేశించింది. 1991లో తెలుగులో ఘన విజయం సాధించిన ప్రేమ ఖైదీ చిత్రం రీమేక్ ద్వారా హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత అందాజ్ అప్నా అప్నా, రాజా హిందుస్థానీ, హీరో నంబర్ 1, దిల్ తో పాగల్ హై, జుబేదా లాంటి చిత్రాల్లో నటించింది. హిందీలో అప్పటి అగ్రహీరోలతో జతకట్టి మెప్పించింది.

భర్తతో విడాకులు తీసుకొని
కెరీర్ పీక్‌లో ఉండగానే, సంజయ్ కపూర్ అనే ప్రముఖుడిని వివాహం చేసుకొన్నది. 2003లో వీరిద్దరి వివాహం జరిగింది. వారి మధ్య వ్యక్తిగత విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో 2016లో విడాకులు తీసుకొన్నారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం పెళ్లి, పిల్లలతోపాటు కెరీర్ మీద కూడా దృష్టిపెట్టింది. తాజాగా తన అందాలను ఆరబోస్తూ ఇలా మీడియాలో అటెన్షన్ క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











