రహస్యాన్ని బయట పెట్టిన రష్మిక.. కోపంతో రగిలిపోతున్న దర్శకుడు
రష్మిక మందన్నా.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అద్భుతమైన అందంతో పాటు అభినయం చేయగలిగే ఈ హీరోయిన్ వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగులో ఆమె చేసిన మూడు సినిమాల్లోనూ యాక్టింగ్ స్కోప్ ఉండడంతో సినీ పెద్దల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే బడా హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో చేసిన 'డియర్ కామ్రేడ్'లో రష్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఇదిలాఉండగా, తాజాగా రష్మిక చేసిన ఓ పని హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు, ఓ దర్శకుడి ఆగ్రహానికి కూడా కారణమైంది. కోలీవుడ్ హీరో కార్తీ సరసన రష్మిక ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ప్రకటించలేదు. కానీ, రష్మిక మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా 'సూల్తాన్ షూటింగ్‌లో నాలుగో రోజు. మీరు లుక్‌ను చూడలేరు' అని ఓ ఫొటోపై రాసింది.

దీంతో కార్తీ సినిమా పేరు 'సుల్తాన్' అని అందరికీ తెలిసిపోయింది. దీంతో చిత్ర యూనిట్ ఆమెపై గుర్రుగా ఉంది. చిత్ర డైరెక్టర్ అయితే, ఆమెపై భారీ స్థాయిలో ఫైర్ అయ్యాడని సమాచారం. ఓ ప్రత్యేక కారణం వల్ల సినిమా టైటిల్ రివీల్ చేయకుండా ఉంటే.. నువ్వెలా ప్రకటిస్తావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై రష్మిక కూడా బాధ పడుతోందని తెలుస్తోంది.
మరోవైపు, రష్మిక.. కార్తీతో చేస్తున్న సినిమా కాకుండా, మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న 'సరిలేరు నీకెవ్వరు', నితిన్ - వెంకీ కుడుముల 'భీష్మ'లోనూ నటిస్తోంది. అలాగే, అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రాబోతున్న చిత్రంలోనూ అవకాశం దక్కించుకున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











