హీరో బర్త్ డే.. సింగిల్ పోస్ట్ పెట్టని త్రిష.. దారుణంగా హీరో ఫ్యాన్స్ ట్రోలింగ్
చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి పరిచయాలు కీలకపాత్రలు పోషిస్తూ ఉంటాయి. వారు ఎదగాలన్నా.. ఏదైనా సమస్య నుంచి బయటపడాలన్నా ఈ పరిచయాలే ముఖ్యం. చిన్నవారు పెద్దల అండ కోసం తపిస్తూ ఉంటారు. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే లౌఖ్యం ప్రదర్శించాలని సీనియర్ నటుడు చెబుతుంటారు. దీనిని ఒంటబట్టించుకున్న వాళ్లు బాగానే వృద్ధిలోకి వచ్చినట్లుగా కొందరు బయటపెట్టారు. ముఖ్యంగా హీరోల డామినేషన్ నడిచే ఇండస్ట్రీలో వారిని నొప్పించే ప్రయత్నం చేయకూడదని అంటారు. అయితే సీనియర్ హీరోయిన్ త్రిష ఓ హీరోను ఘోరంగా అవమానించారట. ఈ వివరాల్లోకి వెళితే..
పాతికేళ్ల ప్రస్థానం
ఈ జనరేషన్‌లో హీరోయిన్లు గట్టిగా ఐదేళ్లు నిలబడితేనే గొప్ప.. అలాంటిది ఏకంగా పాతికేళ్లుగా స్టార్‌గా వెలుగొందుతున్నారు త్రిష కృష్ణన్. ఆమెతో పాటు కెరీర్ ప్రారంభించిన వారు ఇప్పటికే ఫేడ్ అవుట్ అయిపోవడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయారు. అయితే త్రిష మాత్రం నేటికీ నెంబర్ వన్ హీరోయిన్‌గానే కొనసాగుతున్నారు. 43 ఏళ్ల వయసులోనూ చెక్కుచెదరని గ్లామర్‌తో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభరతో పాటు తమిళంలో స్టార్ హీరోల సరసన త్రిష నటిస్తున్నారు.

త్రిష- విజయ్ ఎఫైర్
మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న త్రిష జీవితంపై ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. గతంలో ఓ వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవ్వగా.. పెళ్లికి దూరంగా సినిమాలపై ఫోకస్ పెట్టారు త్రిష. తాజాగా ఇళయ దళపతి విజయ్‌తో ఈ ముద్దుగుమ్మ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారంటూ గత కొద్దినెలలుగా వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ రహస్యంగా ఫారిన్‌కు వెళ్లడం, చెన్నైలోనే కలుసుకోవడం వంటి వార్తలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. త్వరలోనే త్రిష- విజయ్‌ల పెళ్లి జరగబోతోందని.. ఇందుకోసం తన భార్యకు విజయ్ విడాకులు ఇవ్వబోతున్నట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. విజయ్ పుట్టినరోజు సందర్భంగా గత నెలలో త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒకే సోఫాలో త్రిష- విజయ్ చాలా క్లోజ్‌గా కూర్చొని ఉండగా.. త్రిష పెంపుడు కుక్కను విజయ్ ముద్దు చేస్తూ కనిపించారు.
కరుప్పులో హీరోయిన్‌గా
ఇదే ఇప్పుడు మరో స్టార్ హీరో సూర్య అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రస్తుతం సూర్య సరసన త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం కరుప్పు. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శ్వాసిక, సుప్రీత్ రెడ్డి, యోగి బాబులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సూర్య కెరీర్‌లో 45వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. జూలై 23న హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా కరుప్పు మూవీ టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు సర్‌ప్రైజ్ చేశారు మేకర్స్.
త్రిషపై సూర్య అభిమానుల ఆగ్రహం
సూర్య పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేశారు. అయితే త్రిష మాత్రం కనీసం చిన్న పోస్ట్ కూడా పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నప్పుడు సహ నటుడిని గౌరవించాలని అభిమానులు మండిపడుతున్నారు. విజయ్‌కి బర్త్ డ్ విషెస్ చెప్పి.. తమ హీరోని పక్కనపెట్టడంపై సూర్య అభిమానులు త్రిషను ట్రోలింగ్ చేస్తున్నారు. త్రిష- సూర్యల మధ్య దాదాపు 25 ఏళ్లుగా పరిచయం ఉంది.. అలాంటిది ఆయనను విష్ చేయకపోవడం ఏంటని మండిపడుతున్నారు. ఇదంతా పక్కనపెడితే.. కనీసం కరుప్పు టీజర్‌ను కూడా తన సోషల్ మీడియా ఖాతాలలో పెట్టకపోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. మరి దీనిపై త్రిష ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











