Peddi: రామ్ చరణ్ మూవీని వదులుకున్న సూర్య హీరోయిన్.. కారణం వింటే షాకే!

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో తెరకెక్కిన మూవీ 'పెద్ది'. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా పెద్ది సినిమాను ఓ క్రేజీ బ్యూటీ రిజెక్ట్ చేసిందట. అసలు ఆ కారణం వింటే మాత్రం షాక్ అవుతారంట.

పెద్ది సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్ర అయినా చేయడానికి నటీమణులు ఆసక్తి చూపుతుంటారు.కానీ పెద్ది సినిమాను ఓ బ్యూటీ రిజెక్ట్ చేసింది. ఆ బ్యూటీ ఎవరో కాదు.. ప్రముఖ మలయాళ నటి స్వాసిక (Swasika). ఈ అమ్మడు పెద్ది లో కీలక పాత్ర ఆఫర్ వచ్చినప్పటికీ,ఆమె ఆ అవకాశాన్ని తిరస్కరించిందట. రామ్ చరణ్ సినిమా ఆఫర్‌ను నేరుగా తిరస్కరించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Swasika Rejects Ram Charan s Peddi Offer Reason Behind Her Decision Shocks Fans

పెద్ది రిజెక్ట్ చేసిన విషయాన్ని హీరోయిన్ స్వాసిక స్వయంగా బయటపెట్టారు. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నాకు చాలాసార్లు తల్లి పాత్రలు చేయమని అడిగారు. కానీ నన్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన ఆఫర్ మాత్రం 'పెద్ది' నుంచే వచ్చింది. ఆ సినిమాలో రామ్ చరణ్‌కు తల్లిగా నటించాలని చెప్పారు. అది చాలా పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ నేను వెంటనే నో చెప్పేశాను" అని తెలిపారు.

స్వాసిక ప్రస్తుతం 34 ఏళ్ల వయసు, రామ్ చరణ్ వయసు 41 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో తనకంటే వయస్సులో పెద్దవాడైన హీరోకు తల్లిగా నటించడం తనకు సహజంగా అనిపించలేదని అభిప్రాయపడ్డారు. "ఇప్పుడే నా కెరీర్‌లో తల్లి పాత్రలు చేసే దశకు వచ్చానని నేను భావించడం లేదు. అలాంటి పాత్రలు చేస్తే మళ్లీ వరుసగా అలాంటి అవకాశాలే వస్తాయి. అందుకే చాలా జాగ్రత్తగా పాత్రలను ఎంపిక చేసుకుంటున్నాను" అని వివరించారు.

స్వాసిక చెప్పిన ప్రకారం.. తమిళ చిత్రం 'లబ్బర్ పందు'లో హీరోయిన్‌కు తల్లిగా నటించిన తర్వాత ఆమెకు వరుసగా మదర్ రోల్స్ ఆఫర్లు రావడం ప్రారంభమైంది. అయితే కెరీర్‌ను ఒకే రకమైన పాత్రలకు పరిమితం చేయకూడదనే ఉద్దేశంతో ఆ అవకాశాలను తిరస్కరిస్తూ వచ్చానని చెప్పారు. అదే కారణంతో 'పెద్ది' ఆఫర్‌ను కూడా వదులుకున్నానని వెల్లడించారు.

సినీ పరిశ్రమలో హీరోయిన్‌లకు తక్కువ వయసులోనే తల్లి పాత్రలు ఆఫర్ చేయడం కొత్త విషయం కాదు. గతంలో కూడా పలువురు నటీమణులు ఇలాంటి పాత్రలను అంగీకరించగా, మరికొందరు కెరీర్ దృష్ట్యా తిరస్కరించారు. ఈ క్రమంలో స్వాసిక తీసుకున్న నిర్ణయం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొందరు అభిమానులు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తూ, ఇంకా ప్రధాన పాత్రలు చేయగల వయసులో ఉన్న నటి తల్లి పాత్రలకు ఒప్పుకోకపోవడం సరైన నిర్ణయమేనని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, కథలో ఆ పాత్ర ఎంత కీలకమో తెలియకుండానే భారీ ప్రాజెక్ట్‌ను వదులుకోవడం సాహసోపేతమైన నిర్ణయమని కొందరు పేర్కొంటున్నారు.

ఇక స్వాసిక కెరీర్ విషయానికి వస్తే.. ఆమె అసలు పేరు పూజా విజయ్. తమిళ సినిమా 'వాగై'తో నటిగా పరిచయమైన ఆమె, తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టెలివిజన్ రంగంలోనూ సక్సెస్ సాధించిన స్వాసిక, సీరియల్స్ ద్వారా ఇంటింటికీ చేరువయ్యారు. మలయాళంలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆమె, తమిళం, తెలుగులో కూడా అవకాశాలు అందుకుంది. తెలుగులో నితిన్ నటించిన 'తమ్ముడు' చిత్రంలో ప్రతినాయక పాత్రలో కనిపించారు. ఇటీవల పలు భాషల్లో విభిన్నమైన పాత్రలు చేస్తున్నారు. గతేడాది మలయాళంలో 'రండాం యామం', తమిళంలో 'రెట్రో', 'మామన్' చిత్రాల్లో నటించారు. తాజాగా సూర్య 'కరుప్పు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

మరోవైపు 'పెద్ది' చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాల్లో ఒకటిగా భావిస్తున్నారు. 'రంగస్థలం' తర్వాత మాస్ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, సినిమా విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Read more about: ram charan Karuppu peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X