60 ఏళ్ల బిజినెస్‌మెన్‌తో అఫైర్.. కస్తూరి జీవితంలో వాస్తవం ఏమిటి?

మనసులో ఎలాంటి భావం ఉన్నా ఉన్నది ఉన్నట్లు ముఖం మీద చెప్పే నటీనటులు కొంతమంది ఉంటారు. వారు ఏం చేసినా, ఏం మాట్లాడినా ఖచ్చితంగా వివాదాస్పదం అవుతుంది. ఈ కోవలోకే వస్తారు సీనియర్ నటి కస్తూరి శంకర్. ముక్కుసూటితనం మెండుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. తొలి నుంచి ఇదే బిహేవియర్‌తో ఏరికోరి వివాదాల్లో చిక్కుకున్నారు. తమిళనాడులో ఉంటున్న తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయినప్పటికీ తిరిగి యాక్టీవ్ అయ్యారు. చిత్ర పరిశ్రమలో తాను ఎదుర్కొన్న కష్టాలు, హీరోయిన్ల పరిస్ధితిపై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వివరాల్లోకి వెళితే..

1991లో ఆతా ఉన్ కోయిలే సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె.. మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. నిప్పు రవ్వ, గాడ్ ఫాదర్, సొగ్గాడి పెళ్లాం, మెరుపు, చిలక్కొట్టుడు, అన్నమయ్య, మా ఆయన బంగారం, ఆకాశ వీధిలో, డాన్ శీను, శమంతకమణి, సింబా వంటి సినిమాలతో తెలుగువారిని పలకరించారు. కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకున్న కస్తూరి ఆ తర్వాత తన కెరీర్‌కు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీ, పిల్లల కోసం అంకితమయ్యారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కస్తూరి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలలో నటిస్తున్నారు. అలాగే బుల్లితెరపై అదరగొడుతున్నారు. తెలుగులో ఆమె నటించిన గృహలక్ష్మీ సీరియల్.. ప్రేక్షకులకు కస్తూరిని దగ్గర చేసింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు.

Kasthuri Shankar gave clarity about rumours on her relation with 60 yr old business man and Personal Struggles

నన్ను సినిమాల్లోకి పంపించడంపై బంధువులు, సన్నిహితులు నానామాటలు అనేవారు. దానికి మా నాన్న అదిరిపోయేలా తిప్పికొట్టేవారు. ఎవరు ఏం మాట్లాడితే ఏంటీ? మా అమ్మాయైతే నిప్పులాంటిది.. మాకు తెలుసు అది చాలు. ఎంతోమంది మాట్లాడుతుంటారు.. వాళ్ల పని మాట్లాడటం మాత్రమే. అవన్నీ పట్టించుకుంటే మనం ఎలా బ్రతుకుతాం... ఏం చేయకుండా దాని గురించి జడ్జిమెంట్ పాస్ చేయకూడదని నాన్న చెప్పేవారు. మా అమ్మ లాయర్... హైకోర్టులో ప్రాక్టీస్ చేసేవారు. ఆమె జూనియర్‌గా ఉన్న సమయంలో చాలా పెద్ద లాయర్ దగ్గర పనిచేసేవారు. ఆ ఆఫీసులో మా అమ్మ ఒక్కత్తే అమ్మాయి. మిగతా వాళ్లంతా పురుషులే. కానీ ఒక లేడీగా, డెడికేటెడ్‌గా వర్క్ చేసేది. ఎక్కడైనా జడ్జి దగ్గరికి వెళితే 100 శాతం ఆర్డర్‌తోనే వచ్చేది. ఎందుకంటే హోంవర్క్ చేసేది, చక్కగా ప్రెజెంట్ చేసి ఆ ఆర్డర్ తీసుకొచ్చేదని కస్తూరి శంకర్ గుర్తుచేసుకున్నారు.

దాంతో సీనియర్ లాయర్లను.. మా అమ్మని చూపించి తిట్టేవారు ఆ పెద్ద లాయర్. దాంతో మా అమ్మని వాళ్లంతా తప్పుగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ లాయర్ ఈమెను ఎందుకు వెనకేసేకొస్తున్నాడు? జడ్జి దగ్గర ఎందుకు ఆర్డర్స్ వెంటనే వచ్చేస్తున్నాయని దుష్ప్రచారం చేసేవారు. ఆడవాళ్లకు ఇలాంటి ఇబ్బంది ప్రతిచోటా ఉంటుంది. మా అమ్మ ఒకరోజు ఏడుస్తూ ఇంటికొచ్చింది.. రేపటి నుంచి నేను ఆఫీస్‌కి వెళ్లలేనని మా నాన్నతో చెప్పేసింది. నువ్వు వెళ్లకపోతే.. వాళ్లకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది, నువ్వు రాకూడదనే వాళ్లు ఇదంతా మాట్లాడుతున్నారని నాన్న చెప్పారు. నువ్వు ఇంట్లో ఉండి ఓడిపోతావా అని ప్రశ్నించారు. అసలు అలాంటి మగాడు ఎక్కడ దొరుకుతాడు. 100 శాతం పెళ్లాన్ని ఎలా నమ్మారో.. అలాగే నన్ను కూడా నమ్మారు. ఎవరు ఏం చెప్పినా నా వెనకే ఉన్నారని కస్తూరి తెలిపారు.

ఇదే సమయంలో నా గురించి ఓ పెద్ద గాసిప్ వచ్చింది. తమిళనాడులో ఒక పెద్ద బిజినెస్‌మెన్ ఉన్నాడు, ఆయనకి అప్పటికే 60 ఏళ్లు ఉంటుంది, నాకైతే 19 ఏళ్లు. ఆ పెద్దాయన నన్ను ఉంచుకున్నట్లు, నాకు లండన్‌లో ఇల్లు కొనిచ్చినట్లు గాసిప్ వచ్చింది. దాంతో ఎవరికైనా పెద్ద కాంట్రాక్ట్ కావాల్సి వస్తే నన్ను రికమెండ్ చేయమని అడుగుతున్నారు. ఎంత సిగ్గుగా ఉంటుంది నాకు. ఆ టైంలో నాకు తోడుగా ఉన్నది నా తండ్రి. ఈ గాసిప్ వల్లే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసి పంపించేశారు. మా నాన్నలా మా అమ్మ అంత ధైర్యవంతురాలు కాదు.. ఆ వెంటనే సంబంధాలు వెతకడం మొదలుపెట్టి రెండున్నర సంవత్సరాలలో పెళ్లి చేసేశారు. నువ్వు నటించి చాలు ఇక ఆపేయ్.. లేదంటే పెళ్లి కాదని వార్నింగ్ ఇచ్చింది మా అమ్మ. ప్రస్తుతం కస్తూరి శంకర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: kasthuri shankar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X