కోపరేట్ చేయకపోతే.. సినిమాల్లోంచి పీకేసి.. టాప్ హీరోపై ఆరోపణలు

Kasturi Shankar: అలనాటి హీరోయిన్, నటి కస్తూరి శంకర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇంటింటి గృహాలక్ష్మి అనే సీరియల్‌ ద్వారా తులసిగా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. నిత్యం కాంట్రవర్సీతో స్నేహం చేసే ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ అమ్మడు .. తాజా ఓ స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ టాప్ హీరోకి కోపరేట్ చేయకపోవడంతో దారుణంగా టార్చర్ చేశారని, తనని సినిమాల్లో నుంచి కూడా తీసివేశారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కాంట్రవర్సీ నటీ కస్తూరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన సిని కెరీర్ లో కొన్ని సినిమాలలో అనవసరంగా నచ్చానని చాలాసార్లు ఫీలయ్యానన్నారు. అయితే.. ఆ సినిమాల పేర్లు తాను చెప్పలేనని, కానీ, ఓ టాప్ హీరో తనని దారుణంగా టార్చర్ చేశారని, తనకు ఆ విధంగా సహాకరించకపోవడం వల్ల తనని సినిమాల్లో నుంచి తీసివేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది. వాస్తవానికి తనని ఆ స్టార్ హీరో..మూడు సినిమాలలో నటించే అవకాశమిచ్చారనీ, అయితే.. తనకి కోపరేట్ చెయ్యకపోతే.. మిగతా మూడు సినిమాలలో నుండి తనని తీసివేశారని బాధపడింది నటీ కస్తూరి.

Kasturi Shankar shocking comments on Tollywood hero And Shares Casting Couch Experience

అలా ఆ హీరో మూవీలో నుంచి తీసివేయడం తన మంచికే జరిగిందని, అతనితో వర్క్ చేసే సమయంలో తాను ఎన్నో వేధింపులకు గురయ్యానని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హీరోతో నటించిన సినిమాకు మాత్రం తనకు ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ వచ్చిందనీ, ఆ సినిమా పెద్ద హిట్ కావడం వల్ల వరుస అవకాశాలు కూడా వచ్చనని చెప్పుకోచ్చారు. సినిమాల్లో నుంచి తనని తీసివేసిననీ తొలుత బాధపడినా.. ఆ టాప్ హీరోతో నటించకపోవడమే తన లక్కీని, అలా నటించి ఉంటే .. తనని చూసిన ప్రతిసారి అతన్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సి వచ్చేదని, నిజంగా ఆ హిట్ సినిమాలో నటించే సమయంలో తాను చాలా టార్చర్ అనుభవించాలని నటీ కస్తూరి బాధపడ్డారు.

ఓ సినిమాలో నటించే సమయంలో అసలు తనకు చెప్పిన కథ ఒక్కటి.. వారు తీసిన కథ మరొకటి, కొన్ని సినిమాలలో తనతో వర్క్ చేయించుకొని.. డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారంటూ ఫీల్ అయింది. అలాగే.. తన సీని జీవితంలో జరిగిన మరోక చేదు అనుభవాన్ని పంచుకుంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరో అండ్ డైరెక్టర్ తనని వేధించాడని, ఆ స్టార్ డైరెక్టర్ కు అదే ఫస్ట్ మూవీ అని, ఆ సినిమాలో తాను రెండు రోజులు పనిచేశానని, ఆ సమయంలో కొన్ని అభ్యంతరకర ఘటనలు ఎదురయ్యాయని, వాటి గురించి ప్రశ్నించడంతో తనని ఆ సినిమాలో నుండి తీసివేశారని నటి కస్తూరి ఎమోషనల్ అయ్యారు .

Kasturi Shankar shocking comments on Tollywood hero And Shares Casting Couch Experience

అయితే అన్ని సినిమాలలో ఇలాంటి పరిస్థితులు ఎదురు కావనీ, అలాగే.. తన జీవితంలో కొన్ని సినిమాల ఎందుకు విడిచి పెట్టానని చాలా సార్లు బాధపడిన రోజులు కూడా ఉన్నాయని, అందులో వీవీ సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చినా 'ఆమె' అనే సినిమాలో తనని హీరోయిన్ గా సెలక్ట్ చేశారనీ, కానీ డేట్స్ సెట్ కాకపోవడంతో మూవీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ సినిమాలో తన బెస్ట్ ఫ్రెండ్, హీరోయిన్ ఊహా నటించిందని తెలిపారు. ఆ సినిమాలో తాను నటించలేక పోయినందుకు చాలా బాధపడ్డానని అన్నారు నటి కస్తూరి .

అలాగే.. తన సినీ కెరీర్లో అన్నమయ్య , భారతీయుడు లాంటి సినిమాలతో నటనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయనీ, ఆ సినిమాలతోనే తనని మంచి అవకాశాలు వచ్చాయని నటి కస్తూరి తెలిపారు. అయితే.. సినిమాలలో నటించడం కంటే సీరియల్లలో నటించడం చాలా కష్టమని, ఆ సీరియల్ వల్ల తాను మంచి మంచి ప్రాజెక్ట్లను కోల్పోయానని నటి కస్తూరి అన్నారు.కానీ, ఆ సీరియల్ వల్లనే మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యానని, అందులో గృహలక్ష్మి అని సీరియల్ తనకు ఎంతో పాపులారిటీని తీసుకువచ్చిందని, ఆ సీరియల్ వల్లనే తనని తెలుగింటి అమ్మాయిగా గుర్తిస్తున్నారని నటి కస్తూరి సంతోషపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X