రిసార్ట్‌లో పొలిటీషియన్లతో త్రిష పార్టీ.. వివాదంపై టీవీ నటి కస్తూరి క్లారిటీ

సినీనటి కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పావల్సిన అవసరం లేదు. ఏ విషయాన్ని అయినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతూ వార్తల్లో నిలిచారు. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీల్లో ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించిన ఆమె... తర్వాత టీవీ సీరియల్స్ ద్వారా కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ముఖ్యంగా మా ఇంటి మహాలక్ష్మి సీరియల్‌తో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న వివాదాలు, ట్రోలింగ్‌లపై స్పందించడంతో పాటు, హీరోయిన్‌లపై వచ్చే వివాదాలపై కూడా కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారంటే?

అన్యాయం చూస్తూ ఊరుకోను
ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కస్తూరి మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అన్యాయాలపై మాట్లాడటం వల్లనే తాను తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నానని తెలిపారు. ముఖ్యంగా మహిళలపై అన్యాయం జరిగితే తాను మౌనంగా ఉండలేనని, అటువంటి సందర్భాల్లో తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేస్తానని చెప్పారు.
కేవలం మాటల్లోనే కాదు, అవసరమైతే తన చర్యల ద్వారానూ స్పందిస్తానని ఘాటుగా వ్యాఖ్యానించారు.

Kasturi Shankar Strong Reaction on Controversies Trisha amp amp Samantha Issues

త్రిష వివాదంపై కీలక వ్యాఖ్యలు
కస్తూరి, త్రిష కు సంబంధించిన గత వివాదాలను ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా స్పందించారు. ఓ సందర్భంలో నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.త్రిష గురించి మన్సూర్ అలీ ఓ సందర్భంలో ఫన్నీ గా మాట్లాడుతూ.. 'నేను విలన్ కదా.. నేను త్రిషాని రేప్ చేయబోతున్నాను అని భావించా.. అందుకే ఆ సినిమాని ఒప్పుకున్నా..కానీ, మా ఇద్దరి మధ్య కాంబినేషన్లో ఒక్క సీన్ కూడా లేదు. అది జోక్ గానే చెప్పొచ్చు కానీ అది పెద్ద కాంట్రవర్సీగా మారిదని కస్తూరి పేర్కొన్నారు.

అలాగే ఒక రాజకీయ నాయకుడు చేసిన వ్యాఖ్యల వల్ల త్రిష పేరు అనవసరంగా వివాదాల్లోకి లాగబడిందని, ఆ సందర్భంలో త్రిషకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఆమెపై విమర్శలు వచ్చాయని చెప్పారు.'ఓ సందర్భంలో ఓ పొలిటిషన్ మాట్లాడుతూ మేమందరం రిసార్ట్లో ఉన్నప్పుడు త్రిషానే కావాలని కోరుకున్నారు కదా.. త్రిషానే పిలిపించారు కదా..' అంటు కామెంట్ చేశారు. ఆ సమయంలో తాను ఆ వ్యాఖ్యలను ఖండించానని, తర్వాత చిరంజీవి సహా పలువురు ప్రముఖులు కూడా స్పందించారని తెలిపారు. కొన్ని సార్లు మాట్లాడిన మాట్లాడకపోయినా వివాదాలు అనేవి ఇండస్ట్రీ హీరోయిన్లకు సర్వసాధారణమే అంటూ షాకింగ్ కామెంట్ చేసింది.

సమంత వివాదంపై కూడా స్పందన
ఇటీవల సమంత పేరు కూడా కొన్ని వివాదాల్లో వినిపిస్తున్న నేపథ్యంలో... ఆ విషయంపై కూడా కస్తూరి స్పందించారు. 'ఒక్కోసారి హీరోయిన్లు ఎలాంటి తప్పు చేయకపోయినా, పరిస్థితుల వల్ల వివాదాల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. సమంత విషయంలో కూడా అదే జరిగింది. అందులో ఆమె ప్రమేయం ఎంత ఉందో ఆలోచించాలి' అంటూ ప్రశ్నించారు. తనపై వస్తున్న ట్రోలింగ్, ఆరోపణలపై కస్తూరి తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రూలింగ్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇలాంటి విమర్శలు రావడం సహజమని చెప్పారు. తనపై అనవసర ఆరోపణలు, వ్యక్తిగత దూషణలు, సంబంధాలు కల్పించడం వంటి ట్రోలింగ్ జరుగుతున్నా వాటిని పట్టించుకోనని స్పష్టం చేశారు. 'ఎవరో ఒకరు ఎప్పుడూ ట్రోల్ చేస్తూనే ఉంటారు. వాటిని ఎదుర్కోవడం నేర్చుకున్నాను' అంటూ తన మనస్థైర్యాన్ని వెల్లడించారు.

కస్తూరి చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో మహిళలపై జరిగే వ్యవహారాలపై మరోసారి చర్చను రేకెత్తిస్తున్నాయి. తాను ఎదుర్కొంటున్న విమర్శలను పట్టించుకోకుండా, తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడం కొనసాగిస్తానని ఆమె వెల్లడించడంతో... ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more about: kasturi shankar trisha samantha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X