అందరూ తిడుతుంటే బాలయ్య ఒక్కరే సహాయం చేశారు.. అందుకే ఇలా ఉన్నా.. కత్రినా కైఫ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ వెండితెరపై ఎంత ఎనర్జిగా కనిపిస్తారో రియల్ లైఫ్ లో కూడా అంతే చలాకీగా ఉంటారని అందరికి తెలిసిన విషయమే. ఇక హీరోయిన్స్ ఒక్కసారి ఆయనతో నటిస్తే చాలు ఆ అనుభవాన్ని వారు ఎన్నటికీ మరచిపోలేరు. అందుకు ఉదాహరణగా నిలిచాయి కత్రినా కైఫ్ మాటలు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినా 15 ఏళ్ల క్రితం బాలయ్య చేసిన సహాయం గురించి మాట్లాడింది అంటే ఆయన ఎలాంటి వారో చెప్పవచ్చు.

బాలక్రిష్ణతో అల్లరి పిడుగు
కత్రినా కైఫ్ బాలీవుడ్ లో బిజీ అయ్యే ముందు మొదట తెలుగులో రెండు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమా చేశాక ఒక్కసారిగా చాలా ఆఫర్స్ వచ్చాయట. కానీ ఈ సెక్సీ సుందరి మాత్రం ఏరికోరి బాలకృష్ణ సినిమాను సెలెక్ట్ చేసుకుంది. అదే అల్లరి పిడుగు. 2005లో జయంత్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది.

అందరూ తిట్టేవారు..
అయితే ఆ సినిమాకు సంబంధించిన ఒక విషయాన్ని బాలీవుడ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కత్రినా బయటపెట్టింది. ఆమె మాట్లాడుతూ.. మొదట ఒక విషయంలో నన్ను అందరూ బాగా తిట్టేవారు. అన్ని బాగానే ఉన్నాయి కానీ డ్యాన్స్ ఏ మాత్రం బాలేదంటూ పాటకు తగ్గట్టుగా మూమెంట్స్ ఇవ్వడం నేర్చుకో అని హేళన చేసేవారు. అయితే అల్లరి పిడుగు సినిమాలో బాలకృష్ణ ఇచ్చిన సలహాలతో ఒక్కసారిగా నాలో మార్పు వచ్చింది.

అందుకు కారణం బాలక్రిష్ణ
కెమెరా ముందు డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఎలా నడుచుకోవాలి, పాటకు తగ్గట్లుగా ఎలా మూమెంట్స్ ఇవ్వాలి అనే విషయంలో బాలక్రిష్ణ కొన్ని మెళకువలు నేర్పించారు. ఆయన నాకు ఒక గురువులా నేర్పించిన ఆ టెక్నీక్స్ ఇప్పటికి ఫాలో అవుతున్నాను. ఒక విదంగా నాకు బెస్ట్ డ్యాన్సర్ అని గుర్తింపు దక్కుతోంది అంటే అందుకు కారణం బాలక్రిష్ణ అంటూ కత్రినా తెలిపింది.
Recommended Video

చాలా కష్టమని అనుకున్నా..
అలాగే ఆయన షూటింగ్ లో కూడా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తారు అంటూ మొదట బాలయ్యతో డ్యాన్స్ చేయడం అంటే చాలా కష్టమని అనుకున్నా. కానీ ఆయన ఇచ్చిన సలహాలు ఫాలో అవ్వడంతో ఈజీగా డ్యాన్స్ ని ఎంజాయ్ చేయగలిగాను అంటూ కత్రినా వివరణ ఇచ్చింది. ఈ విషయం చెప్పడంతో కత్రినా ఇంకా తెలుగు జ్ఞాపకాలను ఏ మాత్రం మరచిపోలేదని అర్ధమవుతోంది.


Click it and Unblock the Notifications











