twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కత్రినా కైఫ్ మానవత్వం.. దినసరి వేతన కూలీలను ఆదుకోవడానికి..

    |

    కరోనావైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో బాధితులకు సినీ తారలు అండగా నిలుస్తున్నారు. తమకు తోచిన విధంగా వివిధ రూపాల్లో ఆదుకొంటున్నారు. కరోనాపై పోరాటంలో బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కూడా భాగమయ్యారు. మహారాష్ట్ర‌లోని భండారా జిల్లాలోని రోజువారీ వేతన కూలీలకు ఆహారం, సానిటరీ అవసరాలను తీర్చేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు దే హాత్ ఫౌండేషన్‌తో చేతులు కలిపి సహాయం అందిస్తున్నారు.

    ఈ సందర్భంగా కత్రినా కైఫ్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ప్రస్తుత ఏప్రిల్ నెల మనకు చాలా కీలకం. ఈ నెల అందరిని పరీక్షించే సమయం. ఈ లాక్‌డౌన్ పిరియడ్‌లో కరోనాను సమర్ధవంతంగా ఎదురించాలి. ఈ సమయంలో చాలా మంది అనేక రకాలుగా కష్టాలు పడుతున్నారు. అలాంటి వారిని ఆదుకోనేందుకు దే హాత్ ఫౌండేషన్ సహయ కార్యక్రమాల్లో ఇప్పటికే నిమగ్నమైంది. ఈ క్రమంలో వారితో భాగస్వామ్యమై పేదలకు ఆహారం, వైద్య సదుపాయాలు అందించాలని నిర్ణయించుకొన్నాను అని కత్రినా తెలిపారు.

     Katrina Kaif helping hand to Bhandra District people in Maharastra

    ఇప్పటికే కత్రినా కైఫ్ పలు సహాయ నిధులకు తన వంతుగా విరాళాలు ప్రకటించారు. ప్రధాని నిధి, మహారాష్ట్ర సీఎం నిధికి, ఇతర స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించారు. తాజాగా తన వంతుగా భండారా జిల్లాలో ఆకలితో బాధపడుతున్న వారిని ఆదుకోవాలని నిశ్చయించుకొన్నారు. కత్రినా తీసుకొన్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

    English summary
    Bollywood actress Katrina Kaif helping hand to Bhandra District people in Maharastra. Katrina wrote Instagram that "tough month for all of us" but it's amazing to see the efforts people are making across to overcome this pandemic. "As we all know, there are those who are suffering greatly during this time and there are some that have suffered more than others."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X