Don't Miss!
- Sports RCB vs KKR: విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ సిక్సర్.. బిత్తరపోయిన మిచెల్ స్టార్క్! వీడియో
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బికినీలో అదరగొట్టిన కత్రినా కైఫ్.. బీచ్ బ్యూటి అందాలకు సెలబ్రిటీలు ఫిదా
బాలీవుడ్ సెలబ్రిటీల విహార యాత్రలకు, ఆహ్లాదకరమైన ట్రిప్పులకు కరోనావైరస్ బ్రేక్ వేసింది. లాక్డౌన్ కారణంగా గత ఆరు నెలలకుపైగా సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో ఒక్కొక్కరు విహార యాత్రలు, ప్రకృతి ఒడిలోకి చేరుకొని సేద తీరేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్ కూడా సముద్ర తీరంలో విహారయాత్ర చేసింది. బికినీలో సముద్రం ఒడ్డును నిలబడి పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె పోస్టులో ఏం తెలిపిందంటే..
లాక్డౌన్ తర్వాత బీచ్‌కు చేరాను..
లాక్డౌన్ కారణంగా స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న నాకు సూర్య కిరణాలను, ఇసుక, బీచ్‌ను చాలా మిస్ అయ్యాను. అందుకే కాస్త రిలీఫ్ దొరక్కగానే సముద్రం తీరానికి చేరాను. సముద్ర అలలు ఎనలేని ఆనందాన్ని ఇస్తున్నాయి అంటూ ఓ స్టన్నింగ్ ఫోటోను షేర్ చేశారు. బీచ్ వద్ద కత్రినా బికినీ ఫోటోకు నెటిజన్ల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తున్నది.
కరోనా కారణంగా బీచ్‌లను మిస్ అయ్యాను
సముద్రం ఒడ్డును బీచ్‌లో ఎలాంటి మేకప్ లేకుండా సింపుల్‌గా ఉన్నాను. బీచ్‌లంటే నాకు చెప్పలేనంత ఇష్టం. సముద్ర ఒడ్డున గడపడం అంటే నాకు సరదా. అలాంటి క్షణాలను గత ఆరు నెలల్లో మిస్ అయ్యాను. ఇప్పుడు ప్రకృతి ఒడిలో ఎంజాయ్ చేస్తున్నాను అంటూ కత్రినా వెల్లడించింది. తాజా ఫోటోలో కత్రినా లుక్స్, అందం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది.
హాట్‌గా ఉన్నావంటూ.. ప్రీతీ జింటా కామెంట్
కత్రినా బికినీ ఫోటోపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. ప్రీతీ జింటా కామెంట్ చేస్తూ రెండు ఎర్రటి హార్ట్ ఎమోజీల మధ్య హాట్‌గా ఉన్నావు అన్నారు. ఇంకా తుంటరి నెటిజన్లు వికీ కౌశల్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అలాగే ఇంత అందమైన భామ సముద్రంలో దిగితే అంతకంటే భాగ్యం ఏమైనా ఉంటుందా అని అన్నారు.
వికీ కౌశల్‌తో డేటింగ్
ఇక కత్రినా కైఫ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. కత్రినా కైఫ్ మరోసారి ప్రేమలో పడింది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో వికీ కౌశల్‌తో డేటింగ్ చేస్తున్నారు. లాక్డౌన్ తర్వాత వికీ కౌశల్ ఇంట్లోకి వెళ్తూ మీడియా కంటికి చిక్కారు. ఇప్పుడు బాలీవుడ్లో వీరిద్దరి అఫైర్ హాట్ టాపిక్‌గా మారింది.
Recommended Video
అక్షయ్ కుమార్‌తో సూర్యవంశీ చిత్రంలో
ఎప్పుడూ ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉండే కత్రినా కైఫ్‌కు దాదాపు 15 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సందర్భం ఏదైనా ఫోటోలు పెట్టి నెటిజన్లతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. ఇక భారత్ చిత్రం తర్వాత అక్షయ్ కుమార్‌తో కలిసి సూర్యవంశీ చిత్రంలో నటించారు. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది.