పెళ్ళయ్యాక కూడా అందాల ఆరబోతలో వెనక్కు తగ్గని కత్రినా.. బ్లాక్ స్విమ్ సూట్లో అందాల విందు!

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ జంట మళ్లీ సినిమాల షూటింగ్‌లలో బిజీ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇక తాజాగా తన హాట్ మోనోకిని ఫోటోలు ఆమె షేర్ చేయడంతో ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 డిసెంబర్లో వివాహం

డిసెంబర్లో వివాహం


బాలీవుడ్‌లో హీరోయిన్ గా మారిన నాటి నుంచి పలువురు హీరోలతో లవ్‌ట్రాక్‌లు నడిపిన కత్రిన ఎట్టకేలకు ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంటున్న విక్కీతో సహజీవనం చేసి పెళ్లి చేసుకుంది. కరోనా హడావుడి ఉన్న సమయంలో కూడా రాజస్థాన్‌లో ఒక ఖరీదైన హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దగా సెలబ్రిటీలను పిలవకుండా కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నితులయిన సినీ సెలబ్రిటీల సమక్షంలో వీరి పెళ్లి జరిగిపోయింది.

 టోన్డ్ బాడీ ఫిగర్‌

టోన్డ్ బాడీ ఫిగర్‌


వివాహం తర్వాత కత్రినా ఎక్కువగా తన సొంత ఫోటోలు కాకుండా తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఫొటోలు అభిమానులతో పంచుకుంటోంది. అదలా ఉంచితే తాజాగా కత్రినా కైఫ్ తన అందమైన మరియు ఆకర్షణీయమైన ఫోటోలను పంచుకుంది. కత్రినా కైఫ్ తన బీచ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ ఫోటోలలో, కత్రినా నల్ల మోనోకిని ధరించి, పెద్ద నల్లటి టోపీని ధరించి ఇసుక పై కూర్చొని పోజులిచ్చింది. ఈ ఫోటోల్లో కత్రినా చిరునవ్వు చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. రెండు ఫోటోలలో, కత్రినా తన టోన్డ్ బాడీ ఫిగర్‌ను ప్రదర్శిస్తుండగా, మరో పిక్ లో ఆమె సెక్సీ స్టైల్‌ను కనబరుస్తోంది.

టోన్డ్ బాడీ ఫిగర్‌

టోన్డ్ బాడీ ఫిగర్‌


ఈ ఫోటోలు ఎక్కడివి, అనే విషయం ఇంకా తెలియరాలేదు. కత్రినా కైఫ్ కొంతకాలం క్రితం భర్త విక్కీ కౌశల్‌తో కలిసి హాలిడేకి వెళ్లింది. ఇద్దరూ పడవలో శృంగారభరితంగా గడిపారు. ఈ కొత్త ఫోటోలు కూడా విక్కీ కౌశల్‌తో కలిసి వెకేషన్‌లో ఉన్నవే అయ్యి ఉంటాయని చెప్పచ్చు. కత్రినా పోస్ట్‌పై అభిమానులు చేసిన కామెంట్స్ కూడా దుమారం రేపుతున్నాయి. ఒక అభిమాని అయితే కత్రినా కైఫ్‌ను వండర్ వుమన్‌ అని కూడా పోల్చారు. షేర్ చేసిన 45 నిమిషాల్లోనే ఈ కత్రినా కైఫ్ ఫోటోలను 5 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ నంబర్లు ప్రతి క్షణం మారుతూనే ఉన్నాయి.

విడుదలకు సిద్ధం


బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసిన కత్రినా కైఫ్ హాట్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది. ఆమె చేస్తున్న సినిమాల విషయానికి వస్తే కత్రినా కైఫ్ చివరిగా సూర్యవంశీ చిత్రంలో కనిపించింది. ఇప్పుడు టైగర్ 3 చిత్రంలో కత్రినా కైఫ్ కనిపించబోతోంది. టైగర్ ఫ్రాంచైజీకి ఇది మూడవ చిత్రం, ఇందులో సల్మాన్ ఖాన్‌తో కత్రినా జంట మరోసారి కనిపించనుంది. ఇది కాకుండా ఫోన్ భూత్, మెర్రీ క్రిస్మస్ అనే సినిమాలు కూడా కత్రినా చేస్తుండగా అవి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. మొత్తం మీద కత్రినా ఘాటు అందాల ఆరబోత చర్చనీయాంశం అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X