ఆయనకు ప్రియాంక చోప్రా మొదటి ఛాయిస్ కాదు.. బాంబు పేల్చిన కత్రినా కైఫ్

Recommended Video

Katrina Kaif On Replacing Priyanka Chopra In Bharat Movie

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ నటించిన భారత్ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. అయితే కత్రినాకు ముందు ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించాల్సింది. కొంత మేరకు షూటింగ్ కూడా ఆమెపై చిత్రీకరించారు. అయితే నికీ జోనస్‌తో పెళ్లి కారణంగా ప్రియాంక తప్పుకోవడంతో ఆమె స్థానంలో కత్రినా తీసుకోవడం జరిగింది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా కత్రినా కైఫ్ బాలీవుడ్ పత్రికతో మాట్లాడుతూ..

 మా ఇద్దరి కెమిస్ట్రీ సూపర్

మా ఇద్దరి కెమిస్ట్రీ సూపర్

నాది, సల్మాన్ ఖాన్‌ది మంచి జంట. మా ఇద్దరి కెమిస్ట్రీ బ్రహ్మండంగా ఉంటుంది. ఈ సినిమా చేయాలని అనుకొన్నప్పుడు.. కొత్తరకమైన కెమిస్ట్రీ స్క్రిప్టు డిమాండ్ చేస్తుందని తెలుసుకొన్నాను. స్క్రిప్టు డిమాండ్ మేరకు నేను ఆ పాత్రలో ఒదిగిపోయాను. ఈ సినిమా ఆఫర్ లభించగానే ప్రతీ నిమిషం నేను ఆ పాత్ర కోసమే పనిచేశాను. అందుకే తెరపైన అంతగా పడింది అని కత్రినా అన్నారు.

టైగర్ జిందా హై మాదిరిగానే

టైగర్ జిందా హై మాదిరిగానే

టైగర్ జిందా హై సినిమా మాదిరిగా భారత్ ఓ డిఫరెంట్ యాక్షన్ మూవీ. ప్రతీ ఒక్కరికి నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. సల్మాన్ ఖాన్, నా మధ్య ఉండే సన్నివేశాలు చాలా కొత్తగా ఉంటాయి. సినిమా చూస్తే మా మా కెమిస్ట్రీ ఎలా వర్కవుట్ అయిందో.. నా పాత్ర ప్రాధాన్యత ఏంటో మీరే గ్రహిస్తారు అని కత్రినా పేర్కొన్నారు.

 దర్శకుడితో నా రిలేషన్ ఎలా ఉందంటే

దర్శకుడితో నా రిలేషన్ ఎలా ఉందంటే

దర్శకుడు అలీ అబ్బాస్‌తో నాకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఆయనతో విభేదాలు ఉన్నాయనేది అవాస్తవం. ప్రతీ విషయానికి మేం కాంప్రమైజ్ కాలేము. మా మధ్య విభేదాలు ఉన్నాయని అనిపిస్తే కలిసి పనిచేయడానికి వాటిని పరిష్కరించుకొంటాం. దానిని బరువుగా భావించలేం. ఎదైనా ఆసక్తికరమైన విషయం ఉంటే నా వద్దకు వచ్చి నాతో చర్చిస్తారు అని కత్రినా వెల్లడించారు.

రెండు నెలలపాటు హోంవర్క్

రెండు నెలలపాటు హోంవర్క్

దర్శకుడు అలీ కెరీర్‌లో రాసుకొన్న గొప్ప స్క్రిప్టు భారత్ చిత్రం. అందులో కుముద్ (హీరోయిన్) పాత్ర చాలా బాగుంటుంది. నా కెరీర్‌లో నాకు చాలా ఇష్టమైన పాత్ర అది. అందుకే ప్రియాంక వదిలేసిన తర్వాత వాళ్లు అడిగిన వెంటనే నేను చేయడానికి ముందుకొచ్చాను. ఈ పాత్ర కోసం నేను రెండు నెలలు హోంవర్క్ చేశాను. నా కెరీర్‌లో చేసిన అత్యుత్తమ పాత్ర అని కత్రినా పేర్కొన్నారు. భారత్ చిత్రం రంజాన్ పండుగను పురస్కరించుకొని జూన్ 5వ తేదీన రిలీజ్ కానున్నది.

భారత్ చిత్రంలో ప్రియాంక

భారత్ చిత్రంలో ప్రియాంక

భారత్ సినిమా నిర్మాత అతుల్ అగ్నిహోత్రికి చాలా సపోర్ట్‌గా ఉంటారు. ఈ సినిమాను ముందుగా నన్ను చేయమని అడిగారు. చివరకు ప్రియాంక తప్పుకోవడంతో ఏం జరిగిందో మీకు తెలుసు. వాస్తవానికి నిర్మాత అతుల్ నన్నే తీసుకోవాలని అనుకొన్నారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ఎలాగైనా ఈ సినిమా నేనే చేయాలని రాసిపెట్టి ఉంది కాబట్టి మళ్లీ అది నావద్దకే వచ్చింది అని కత్రినా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X