For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భ‌ర్త‌తో రెచ్చిపోయిన క‌త్రినా కైఫ్.. స్విమ్మింగ్ పూల్‌లో లోదుస్తులతో ఉన్న ప్రైవేటు పిక్ వైరల్!

  |

  బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాన్నాళ్ల పాటు సంపాదనే ధ్యేయంగా, స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా బతికిన ఆమె ఇప్పుడు అన్నిటికీ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదిస్తోంది. గత ఏడాది డిసెంబర్‌లో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం అతి కొద్ది మంది సన్నిహితులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ జంట మళ్లీ సినిమాల షూటింగ్‌లలో బిజీ అయినా క్వాలిటీ టైం గడిపే ప్రయత్నం చేస్తోంది. తాజాగా కత్రినా తన భర్తతో కలిసి ఉన్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలు

  డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కి

  డిసెంబర్ లో పెళ్లి పీటలు ఎక్కి

  బాలీవుడ్‌లో హీరోయిన్ గా నిలదొక్కుకునే క్రమంలో అనేక మంది హీరోలతో లవ్‌ట్రాక్‌లు నడిపిన కత్రిన ఎట్టకేలకు బాలీవుడ్ లో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న విక్కీ కౌశల్ తో ప్రేమలో పడి సహజీవనం చేసిన ఆమె ఆ తర్వాత పెళ్లి దాకా తీసుకువెళ్ళింది. రాజస్థాన్‌లో ఒక ఖరీదైన హోటల్లో కత్రినా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే కరోనా టెన్షన్ ఉండడంతో అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితులైన సినీ సెలబ్రిటీల సమక్షంలో పెళ్లి జరిగిపోయింది.

  భర్తతో కలిసి

  వివాహానికి ముందు ఎక్కువగా తన ఫోటోలు, తన అప్డేట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చిన కత్రినా పెళ్లి అయ్యాక మాత్రం ఎక్కువగా తన సొంత ఫోటోలు కాకుండా తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఫొటోలు,భర్తతో కలిసి ఉన్న ఫోటోలను మాత్రమే అభిమానులతో పంచుకుంటోంది. ఇవి కాక క‌త్రినా తరచుగా సోషల్ మీడియాలో బోల్డ్ పిక్స్ కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

  గాలి దూరనంత దగ్గరగా

  గాలి దూరనంత దగ్గరగా

  ఇక తాజాగా ఈ సారి బాలీవుడ్ ముద్దుగుమ్మ అభిమానులు అందరికీ హాట్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయినట్టునుంది. అందుకే ఆమె ఏకంగా తన భర్తతో రొమాన్స్ చేస్తున్న ప్రైవేట్ పిక్ ని బయట పెట్టింది. నీటిలో తడిసిన ఇద్దరి శరీరాలు గాలి దూరనంత దగ్గరగా ఒక్కటైపోయినట్టు ఫొటోలో కనిపిస్తోంది. విక్కీ కౌశ‌ల్‌తో హాట్ హాట్‌ పూల్ పిక్చర్‌ను షేర్‌ చేయడంతో ఆ ఫొటో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

  లోదుస్తులతో ఉన్న క‌త్రినా

  లోదుస్తులతో ఉన్న క‌త్రినా

  ఆ ఫొటో షేర్ చేసిన గంట‌లోపే ఆ ఫొటోకు 1 మిలియ‌న్ పైగా లైక్స్ వ‌చ్చాయంటే.. అది ఎంత‌గా జ‌నాన్ని ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ ఫొటోకు ఆమె "నేను, నావాడు" అని ఆమె క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫొటోలో స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న విక్కీని లోదుస్తులతో ఉన్న క‌త్రినా ఉద్రేకంతో కౌగిలించుకుంటున్నట్టు మనకి కనిపిస్తోంది.

  సినిమాల విషయానికి వస్తే

  సినిమాల విషయానికి వస్తే


  ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కత్రినా సల్మాన్ ఖాన్ సరసన టైగర్ 3 మూవీలో నటిస్తోంది. ఈ సినిమా చి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. టైగర్ 3 సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఈ సినిమా కాకుండా ఫోన్ భూత్, మెర్రీ క్రిస్మస్ అనే సినిమాలు కూడా కత్రినా చేస్తుండగా అవి విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇక కత్రినా దాల ఆరబోత చర్చనీయాంశం అయింది.

  English summary
  Katrina Kaif shares a private pic with Husband Vicky Kaushal from swimming Pool
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X