Don't Miss!
- News శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం.. ఈ రాశులపై కనక వర్షం
- Finance Gold Rate: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
- Automobiles ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్‌లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Katrina Kaif పెళ్లి తర్వాత తగ్గని రొమాన్స్ జోరు.. తగ్గేదేలే అంటూ అందాల ఆరబోత
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. గతేడాది డిసెంబర్లో విక్కీ కౌశల్-కత్రినా కైఫ్ వివాహం అతికొద్ది మంది అతిథుల సమక్షంలో జరిగిపోయింది. వివాహం తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కత్రిన మళ్లీ సినిమాల షూటింగ్‌లకు హాజరవుతోంది. తాజాగా భర్తతో కలిసి తీసుకున్న సెల్ఫీలను కత్రిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆర్భాటాలకు దూరంగా వివాహం
బాలీవుడ్లో పలువురు హీరోలతో లవ్‌ట్రాక్‌లు నడిపింది కత్రిన. సల్మాన్ ఖాన్‌తో ఆమె ప్రేమాయణం గురించి తెలిసిందే. ఇక, చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ఆమె ప్రేమాయణం పెళ్లి పీటల వరకు వెళ్లింది. ఏమైందో ఏమో ఇద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేసుకున్నారు. ఆ తర్వాత విక్కీతో సహజీవనం చేసిన కత్రిన ఎలాంటి హడావుడీ లేకుండా అతడిని వివాహం చేసుకుంది. రాజస్థాన్‌లో ఒక ఖరీదైన హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దగా సెలబ్రిటీలను పిలవకుండా కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగిపోయింది.
సారీ నిద్రలో ఉన్నా అంటూ..
వివాహం తర్వాత కత్రినా తన వైవాహిక జీవితానికి సంబంధించిన ఫొటోలను తరచుగా అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా విక్కీతో తీసుకున్న సెల్ఫీలను కత్రిన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. వైట్ షర్టు ధరించి ఉన్న విక్కీ భుజంపై కత్రినా తలవాల్చి సెల్ఫీ తీసుకుంది. దానికి `సారీ నేను నిద్రలో ఉన్నా` అంటూ క్యాప్షన్ జోడించింది. ఇద్దరూ సన్‌గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్‌గా ఉన్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కెరీర్ పైనే పూర్తి దృష్టి..
బాలీవుడ్‌లోని ఇతర సెలబ్రిటీ కపుల్లాగానే కత్రినా, విక్కీ కూడా పెళ్లి తర్వాత తమ తమ కెరీర్ల పైనే పూర్తిగా దృష్టి సారించారు. వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. వెండితెర మీదే కాదు.. బుల్లితెర మీద కూడా వీరిద్దరూ కలిసి సందడి చేయబోతున్నారట. వీరిద్దరితోనూ ఓ బడా సంస్థ ఓ భారీ డ్యాన్స్ రియాలిటీ షోను ప్లాన్ చేస్తోందట. ఈ షో కోసం ఇద్దరూ కలిసి సంయుక్తంగా రూ.25 కోట్ల పారితోషికం అందుకోబోతున్నారట. ఇప్పటికే షోకు సంబంధించిన పూర్తి ప్లాన్ కూడా సిద్ధమైనట్టు సమాచారం.
పెళ్లైనా తగ్గేదేలే..
బాలీవుడ్‌తో పాటు తెలుగులోనూ పలు సినిమాలు చేసిన కత్రినా కైఫ్ హాట్ బ్యూటీగా, మంచి డ్యాన్సర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. తెరపై అందాలు ఆరబోయడంలో వెనుకాడని కత్రినా సోషల్ మీడియాలోనూ అదే రేంజ్లో సందడి చేస్తుంటుంది. వివాహం తర్వాత కూడా కత్రినా పలు హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలాగే ఓ ప్రమోషనల్ యాడ్‌లో కత్రినా రొమాన్స్ ఇటీవల హాట్ టాపిక్‌గా మారింది.
Recommended Video
దక్షిణాది నుంచి అవకాశాలు
బాలీవుడ్లోనే కాదు అవకాశం వస్తే దక్షిణాది సినిమాల్లో కూడా నటించేందుకు కత్రిన సిద్ధమవుతోంది. ఇంతకు ముందే కత్రిన తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. తమిళ ప్రముఖ హీరో విజయ్ సేతుపతితో కలిసి నటించేందుకు కత్రిన ఇప్పటికే పచ్చ జెండా ఊపింది. శ్రీ రామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు `మెర్రీ క్రిస్మస్`. అలాగే `ఫోన్ బూత్`, `టైగర్ 3` వంటి సినిమాలతో కత్రిన బిజీ బిజీగా ఉంది.