కత్రినా కైఫ్‌కు కరోనావైరస్ పాజిటివ్.. ప్రియుడికి కూడా తప్పని కోవిడ్19
టాలీవుడ్‌లో మళ్లీశ్వరి చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఇప్పటికే ఆమె ప్రియుడు విక్కి కౌశల్‌కు కోవిడ్19 పాజిటివ్ అనే విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలతో బాధపడుతున్న కత్రినా కైఫ్ రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోగా, ఆమెకు కరోనావైరస్ పాజిటివ్ అని వైద్యులు తేల్చారు.
తనకు కరోనావైరస్ సోకిన విషయాన్ని కత్రినా కైఫ్ స్వయంగా ఇన్స్‌టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. నాకు కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది. వెంటనే నాకు నేనుగా ఐసోలేట్ అయ్యాను. అంతేకాకుండా హోం క్వారంటైన్ అయ్యాను. డాక్టర్ల పర్యవేక్షణలో సురక్షిత ప్రమాణాలను పాటిస్తున్నాను. కొన్ని రోజులుగా నాకు చేరువగా ఉన్న ప్రతీ ఒక్కరు వైద్య పరీక్షలు చేయించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లోనాకు అండగా ఉన్న ప్రతీ ఒక్కరికి థ్యాంక్స్ అంటూ కత్రినా కైఫ్ పేర్కన్నారు.

బాలీవుడ్‌ను ప్రస్తుతం కరోనావైరస్ వెంటాడుతున్నది. గత కొద్దిరోజులుగా అక్షయ్ కుమార్‌తోపాటు సినీ ప్రముఖులంతా కోవిడ్19కు గురయ్యారు. అక్షయ్ కుమార్ రామ్‌సేతు యూనిట్‌లో 45 మందికి కరోనాపాజిటివ్ అని తేలడం సినీ వర్గాలను షాక్ గురిచేసింది. ఇటీవల అమీర్ ఖాన్, ఆలియాభట్, ఆర్ మాధవన్, సంజయ్ లీలా భన్సాలీ, సింగర్ ఆదిత్య నారాయణ్, కార్తీక్ ఆర్యన్, మిలింద్ సోమన్, భూమి పడ్నేకర్, విక్కి కౌశల్ తదితరులు కోవిడ్ బారిన పడిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











