ప్రధాని నరేంద్రమోదీతో హీరోయిన్ కత్రినా కోరిక తీరుతుందా?

దేశ ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ మరోసారి అధికారంలోకి రావడంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. బాలీవుడ్లో కూడా ఆయన్ను అభిమానించే స్టార్ల సంఖ్య రెట్టింపయింది. తాజాగా ఓ ఇంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్న కత్రినా కైఫ్ మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీరు కలిసి డిన్నర్ చేయాలనుకునే ముగ్గరు ప్రముఖులు (జీవించి ఉన్న లేదా చనిపోయిన) పేర్లు చెప్పండి అనే ప్రశ్నకు కత్రినా సమాధానం ఇస్తూ 'మార్లిన్ మన్రో, నరేంద్ర మోదీ, కండోలిజా రైస్' పేర్లు వెల్లడించారు. ఇదే ఇంటర్వ్యూలో కత్రినాతో కలిసి పాల్గొన్న సల్మాన్ మధ్యలో కల్పించుకుని 'సల్మాన్ ఖాన్‌తో డిన్నర్ చేయడం ఇష్టం లేదా?' అంటూ చమత్కరించారు.

పలు చిత్రాల్లో కలిసి నటించినప్పటికీ ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ కలిసి డిన్నర్ చేయలేదట. ఇందుకుగల కారణం సల్మాన్ వెల్లడిస్తూ... 'కత్రినా డిన్నర్ టైమ్ సాయంత్రం 6.30 గంటలు, అది నాకు లంచ్ టైమ్' అంటూ సమాధానం ఇచ్చారు.

Katrina Kaif wants dinner with PM Modi

మీరు ఎవరితో డిన్నర్ చేయాలనుకుంటున్నారు? అనే ప్రశ్నకు సల్మాన్ ఖాన్ సమాధానం ఇస్తూ... 'ఈ ముగ్గరితో మాత్రమే నేను డిన్నర్ కంఫర్టుగా పీలవుతాను.. ఐ, మి, మై సెల్ప్.' అని వ్యాఖ్యానించారు. నా లంచ్, డిన్నర్ అంతా కూడా మా ఇంట్లో కుటుంబ సభ్యులతోనే ఉంటుందని సల్లూభాయ్ చెప్పుకొచ్చారు.

కనీసం కాఫీ ఎవరితో తాగడానికి ఇష్టపడతారు? అనే విషయమైనా చెబుతారా అంటూ కత్రినా అడగటంతో పాటు ఆ లిస్టులో 'మదర్ థెరిసా, గాంధీజీ, నెహ్రుజీ' ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. దీనికి సల్మాన్ రియాక్ట్ అవుతూ 'వారిని కలవడం నాకు ఇష్టమే, కానీ దానికి చాలా సమయం ఉంది' అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X