కత్రినా... టిన్సెల్ టౌన్ లో కొత్త సూపర్ హీరో
కత్తిలాంటి ఫిగరుతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేయడమంటే, కత్రినా కైఫ్ కు వెన్నతో పెట్టిన విద్య, గ్లామరస్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన ఈ బ్యూటీ, స్పెషల్ సాంగ్స్ లోనూ అందాలతో కట్టిపాడేస్తుంది. అప్పుడప్పుడూ కాస్త డెప్త్ ఉన్న పాత్రల్లోనూ మెరిపించినప్పటికీ పూర్తిస్థాయిలో అమ్మడిలోని టాలెంట్ ను ఎవరూ ఉపయోగించుకోలేదనే చెప్పాలి. అయితే ఆ ముచ్చట తీర్చేందుకు టైగర్ జిందా హై డైరెక్టర్ అలీ అబ్బాస్ జాఫర్ రెడీ అయిపోయాడు.
టైగర్ జిందా హై, భారత్ వంటి సినిమాలతో వరుసగా కత్రినా కైఫ్ తో పనిచేస్తున్న అలీ అబ్బాస్ జాఫర్, ఆమె కోసం ఓ కత్తి లాంటి కథను సిద్ధం చేశాడట. మరి ఇందులో హీరో ఎవరంటారా, అసలు హీరోనే కత్రినా అట. నిజమే, అలీ సిద్ధం చేసుకున్న కథలో కత్రినా సూపర్ హీరోలా కనిపించబోతోందట.

కత్రనా టోన్డ్ బాడీ, హైట్ వెయిట్ తో పోల్చుకుంటే, బాలీవుడ్ భామలెవరూ సరితూగరనే చెప్పాలి. ఇక ఇప్పటివరకూ అందాల ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడిన ఆమె శరీర సౌష్ఠవాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతోనే అలీ అబ్బాస్ ఈ కథను సిద్ధం చేసుకున్నాడని తెలుస్తోంది. కత్రినా కైఫ్ కూడా అబ్బాస్ స్క్రిప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. లాక్ డౌన్ పూర్తవుతూనే లోకేషన్ స్కౌటింగ్ ప్రత్యేక బృందం వెళ్లనుందట. మరి సూపర్ హీరోగా కనిపించనున్న కత్రినా ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











