ఆ మాటకు అర్థాలే వేరులే?.. బూతు పురాణం గురించి కావ్య థాపర్

తెలుగు సినిమా దగ్గర కొత్త కొత్త హీరోయిన్స్ కి ఎప్పుడూ కొదవ ఉండదు.. మారుతున్న కాలం మారుతున్న ట్రెండ్ తో పాటుగా కొత్త కొత్త ఫేస్ లు తెలుగు సినిమాకి పరిచయం అవుతూనే ఉంటాయి. ఇలా టాలీవుడ్ సినిమా దగ్గర ఇప్పుడు చాలా మందే హీరోయిన్స్ ఉన్నారు. కాగా ఇలా వచ్చిన వారిలో చాలా మంది మంచి హిట్స్ అందుకున్న వారూ ఉన్నారు అలాగే హిట్స్ లేని వారు కూడా ఉన్నారు.

అయితే గ్లామరస్ రోల్స్ కి అంటూ కూడా కొంతమంది హీరోయిన్స్ కి తెలుగు సినిమా దగ్గర హిట్ ప్లాప్ లేకుండా ఆఫర్స్ వరుసగా వస్తాయి. అలా ఇప్పుడు ఓ హ్యాపెనింగ్ బ్యూటీ అయితే తెలుగు సినిమా దగ్గర కనిపిస్తుంది. కాగా ఆ హాట్ అండ్ హ్యాపెనింగ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది నటి కావ్య థాపర్ అని చెప్పాలి. నార్త్ కి చెందిన ఈ హాట్ ముద్దుగుమ్మ తెలుగులో "ఏక్ మినీ కథ" అనే సినిమాతో పరిచయం అయ్యి మంచి హిట్ అందుకుంది.

kavya thapar felt something with telugu word randi in her initial days

అయితే ఆ సినిమా తర్వాత వెంటనే తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చాయి కానీ వాటిలో ఒక్కటి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ ఈమె అందాలని గ్లామర్ షోని ఎలా చూపించాలో అన్ని రకాలుగా మన తెలుగు దర్శకులు చూపించేసారు. అలా గడిచిన ఈ పలువురు స్టార్స్ సరసన ఆమె నటించింది. అయితే ఇటీవల మ్యాచో స్టార్ గోపీచంద్ సరసన కావ్య కనిపించింది.

అయితే ఈ సినిమాలో కూడా కావ్య థాపర్ పై ఓ రేంజ్ హాట్ షోని దర్శకుడు శ్రీను వైట్ల కూడా చూపించారు. అయితే కావ్య థాపర్ ఇలా తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే తెలుగులో పరిచయం అయ్యిన స్టార్టింగ్ లో ఎదుర్కొన్న ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ని ఆమె షేర్ చేసుకున్న క్లిప్ వైరల్ గా మారింది. అయితే ఈమె హిందీ అమ్మాయి కావడంతో తెలుగులో 'రండి' అనే పదాన్ని అప్పట్లో పెద్ద బూతుగా అనుకుంది అట.

kavya thapar felt something with telugu word randi in her initial days

ఆమెని రిసీవ్ చేసుకున్న అతను రండి మేడం రండి మేడం అంటూ పిలిచాడు అని అయితే తాను తన తల్లితో ఏంటి రండి అంటున్నాడు అనుకున్నామని తెలిపింది. కానీ తర్వాత తెలుగులో రండి అంటే రమ్మంటున్నారు అనే అర్ధం అని తెలుసుకున్నాను అని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఒక క్రేజీ ఇన్సిడెంట్ అని ఆమె చెప్పుకొచ్చింది.

అయితే హిందీలో రండి అంటే నిజంగానే ఓ బూతే.. హిందీ వచ్చినవారికి అయితే ఇది బాగా తెలుస్తుంది. సో కావ్య థాపర్ అలా అనుకోవడంలో తప్పు లేదని చెప్పాలి. ఇలా కావ్య అయితే తనని ఏదో రకంగా అనుకుంటున్నారు అనే భావన నుంచి బయటకి వచ్చింది. కాగా ఇపుడు కావ్య తెలుగులో మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Read more about: kavya thapar viswam
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X