Don't Miss!
- News
ఆర్జేడీకి 16, జేడీయూకు 11 పోస్టులు.. ఇదీ మంత్రి మండలి లెక్క
- Sports
Ricky Ponting : ఒకప్పటి ఆస్ట్రేలియా యోధులతో రికీ పాంటింగ్ ఫోటో.. వార్నర్, పంత్ కామెంట్లు
- Automobiles
దేశీయ మార్కెట్లో Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్: ఇందులో కొత్తగా ఏమున్నాయంటే?
- Lifestyle
గుండె జబ్బులకు కారణమేమిటో తెలుసా?
- Finance
Bank FD Rates: ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన 6 బ్యాంకులు ఇవే.. వీటిలో పెట్టుబడి పెట్టండి..
- Technology
ఎయిర్టెల్ కొత్తగా రెండు ప్రీపెయిడ్ ప్లాన్లను విడుదల చేసింది...
- Travel
పర్యాటకులను ఆకర్షించే మేఘ్ మలహర్ పర్వ విశేషాలు!
ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిన మినీ కధ హీరోయిన్.. కారులో అలా రెచ్చిపోయిందిగా!
కావ్య థాపర్ అంటే అంత త్వరగా గుర్తుపట్టడం కష్టం కానీ ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అయిన ఏక్ మినీ కధ హీరోయిన్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు. బోల్డ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ భామ తాజా ఫొటో షూట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మోడల్ టు హీరోయిన్
ముంబైలో అనేక కంపెనీలకు, ఆ కంపెనీల ప్రొడక్ట్స్ కు మోడల్ గా పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే కావ్య అనుకోకుండా బాలీవుడ్ షార్ట్ ఫిలిం తత్కాల్ లో అవకాశం దక్కించుకుని తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఏ మాయ పేరేమిటో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామకు ఆ సినిమా పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు.

తెలుగు కలిసిరాదు అనుకుందో ఏమో
ఇక తెలుగులో కలిసిరాదు అనుకుందో ఏమో తెలియదు కానీ తమిళంలో మార్కెట్ రాజా ఎం బి బి ఎస్ అనే పేరుతో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ భామకు అక్కడ కూడా క్రేజ్ దక్కలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఈ భామ సైలెంట్ అయిపోయింది చివరిగా సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కధ సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం దక్కింది.

ఏక్ మినీ కధ
కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కధ రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది. బోల్డ్ కాన్సెప్ట్ సినిమా అయినా ప్రేక్షకులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తీశారు అంటూ సినిమా మేకర్స్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.

మేర్లపాక గాంధీ కథ
ఇక సినిమాకు పలు సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ కథ అందించడం ఆసక్తికరం. తన యుక్త వయసులో ఉన్నప్పుడు స్వాతి వీక్లీ మ్యాగజైన్ లో వచ్చే సమరం గారి సెక్సాలజీ కాలంలో చదివిన ఒక చిన్న ప్రశ్న ఆధారంగా ఈ సినిమా రూపొందిందని ఆయన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కండోం యాడ్స్ లో
ఇక ఆ సంగతి పక్కన పెడితే కావ్య అంతకుముందు కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. అయితే హీరోయిన్స్ కెరీర్ ప్రారంభంలో ప్రకటనల్లో కనిపించడం కొత్తేమీ కాదు. కానీ అన్ని రకాల యాడ్స్ లో వాళ్ళు కనిపించరు. మరీ ముఖ్యంగా అప్పుడే ఎదగాలి అనుకుంటున్న వారు కండోమ్ యాడ్స్ వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఈ భామ ఓ కండోమ్ కంపెనీ యాడ్ లో నటించేసి షాక్ ఇచ్చింది.
ప్యాంట్ మర్చిపోయింది
మొన్న మినీకధతో మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా కారులో కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ పొట్టి బట్టలు వేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ భామ కూడా అలాగే పొట్టి బట్టలు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో కొందరు అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది సూపర్ డూపర్ అంటూ కామెంట్స్ పెడుతుంటే కొంతమంది మాత్రం ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.