బికినీలో కావ్య థాపర్ హాట్ ట్రీట్.. అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు.. మినీ కథ కాదిది..మెగా కథే!
ఏక్ మినీ కథ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది కావ్య థాపర్. ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వేదికగా రిలీజ్ అయిన ఏక్ మినీ కధ హీరోయిన్ గా ఆమె బోల్డ్ అటెంప్ట్ తో ముందుకు వచ్చింది. ఇక ఈ భామ తాజా ఫొటో షూట్ తో మళ్ళీ రచ్చ రేపుతోంది. ఈ ఫోటో షూట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మొదటి తెలుగు సినిమా
ముంబైలో అనేక కంపెనీల ప్రొడక్ట్స్ కు మోడల్ గా పనిచేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించిన కావ్య అనుకోకుండా బాలీవుడ్ షార్ట్ ఫిలిం తత్కాల్ లో అవకాశం దక్కించుకుని తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఈ మాయ పేరేమిటో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ విజయ్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామకు ఆ సినిమా డిజాస్టర్ కావడంతో మళ్ళీ పెద్దగా అవకాశాలు దక్కలేదు.

తమిళ్ బాట పట్టి
ఇక తెలుగులో కలిసి రాకపోవడంతో తమిళంలో మార్కెట్ రాజా ఎంబిబిఎస్ అనే పేరుతో తెరకెక్కిన సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. అయితే ఎందుకో ఏమో ఈ భామకు అక్కడ కూడా క్రేజ్ దక్కలేదు. దీంతో కొన్నాళ్లపాటు ఈ భామ సైలెంట్ అయిపోయింది చివరిగా సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన ఏక్ మినీ కథ సినిమాలో ఆమెకు హీరోయిన్ అవకాశం దక్కింది.

మినీ కథతో క్రేజ్
కొత్త దర్శకుడు కార్తీక్ రాపోలు దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా కొద్ది రోజుల క్రితం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏక్ మినీ కథ రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి పాజిటివ్ బజ్ తో దూసుకుపోతోంది. బోల్డ్ కాన్సెప్ట్ సినిమా అయినా ప్రేక్షకులను ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తీశారు అని సినిమా మేకర్స్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది.

కండోమ్ యాడ్ లో
ఇక ఆ సంగతి పక్కన పెడితే కావ్య అంతకుముందు కొన్ని యాడ్స్ లో కూడా నటించింది. హీరోయిన్స్ కెరీర్ ప్రారంభంలో ప్రకటనల్లో కనిపించడం కొత్తేమీ కాదు. కానీ అప్పుడే ఎదగాలి అనుకుంటున్న వారు కండోమ్ యాడ్స్ వంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ ఈ భామ ఓ కండోమ్ కంపెనీ యాడ్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది.
Recommended Video
అసలేమీ లేదా అన్నట్టు
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ సహా యాంకర్స్ అందరూ పొట్టి బట్టలతో ఫోటో షూట్ లు చేస్తూ రచ్చ చేస్తున్నారు. ఈ భామ కూడా మొన్న కారులో కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ భామ ఇప్పుడు మరోసారి బికినీ వేసుకుని రచ్చ రేపింది. దీంతో అభిమానులు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఆ భామ ఒక ఫోటోలో అయితే అసలు ఒంటి మీద ఏమీ లేదా అన్నట్టు మ్యాజిక్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











