అన్ని విప్పేసి చీకట్లో ఫోటోషూట్ ... తెల్లటి అందాలతో రెచ్చగొడుతోన్న ఇస్మార్ట్ పోరి
చిత్ర పరిశ్రమ విచిత్రమైనది.. అందం, అభినయం, టాలెంట్ వున్న వారికి అవకాశాలు రావు. అదే ఎలాంటి హిట్ లేకపోయినా చేతినిండా అవకాశాలతో కొందరు ముద్దుగుమ్మలు దూసుకొస్తుంటారు. ఈ కోవలోకే వస్తారు ముంబై భామ కావ్య థాపర్. ఈమె ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అవుతున్నా ఇంత వరకు సరైన హిట్ పడలేదు. కానీ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కించుకుంటోంది.
ముంబైలో పుట్టి పెరిగిన కావ్య థాపర్ స్థానిక బాంబే స్కాటిష్ స్కూల్‌లో చదువుకున్నారు. అనంతరం ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నటనపై ఆసక్తితో తొలుత షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు కావ్య. 2013లో హిందీలో వచ్చిన ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఆమె నటనా రంగంలో ప్రవేశించారు. అటు మోడల్‌గానూ ఎంట్రీ ఇచ్చిన కావ్య థాపర్.. పతంజలి, మేక్ మై ట్రిప్ సహా దేశంలోని ప్రముఖ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్నో వాణిజ్య ప్రకటనల్లో నటించారు.

ఈ క్రమంలో 2018లో వచ్చిన ఈ మాయ పేరిమిటో సినిమా ద్వారా తెలుగువారిని పలకరించారు కావ్య థాపర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా కావ్య అందాలకు, క్యూట్ లుక్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. తర్వాత మార్కెట్ రాజా ఎంబీబీఎస్‌తో తమిళ్‌లో అడుగుపెట్టారు. తెలుగులో వచ్చిన ఏక్ మినీ కథతో కావ్య థాపర్ బాగా నోటెడ్ అయ్యారు. సంతోష్ శోభన్‌తో బోల్డ్ సీన్స్‌లోనూ ఆమె రెచ్చిపోయారు. తర్వాత హిందీలో మిడిల్ క్లాస్ లవ్ అనే సినిమాలో నటించారు.
అనంతరం కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ సరసన బిచ్చగాడులో ఆయనకు హీరోయిన్‌గా నటించారు. తర్వాత రవితేజతో ఈగల్, సందీప్ కిషన్‌తో ఊరి పేరు భైరవ కోన, రామ్ పోతినేనితో డబుల్ ఇస్మార్ట్, గోపీచంద్‌తో విశ్వం వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించారు. కానీ దురదృష్టవశాత్తూ ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అయితే కావ్య మాత్రం తన యాక్టింగ్, డ్యాన్సింగ్ స్కిల్స్‌తో బాగా గుర్తింపు సంపాదించారు. వెండితెరతో పాటు ఓటీటీలోనూ కావ్య థాపర్ దుమ్మురేపుతున్నారు. హిందీలో కాలి పిలి టేల్స్, ఫర్జీ , పంజాబీలో క్యాట్ వంటి వెబ్ సిరీస్‌లలో నటించి సత్తా చాటారు. ప్రస్తుతానికి కావ్య థాపర్ ఏ కొత్త ప్రాజెక్ట్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
కాగా.. కెరీర్ ప్రారంభంలో ఓ డైరెక్టర్ తనకు కమిట్మెంట్ ఇస్తే నాలుగైదు యాడ్స్‌లో ఆఫర్ ఇస్తానని బేరం పెట్టినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కావ్య థాపర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి ఎన్నో అవరోధాలను దాటాలని కావ్య చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చగొడుతుంటారు. తాజాగా బాలి బీచ్‌లో వైట్ కలర్ డ్రెస్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. చీకటి పడ్డాక బికినీ లాంటి డ్రెస్‌లో బీచ్‌లో జలకాలు ఆడారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











