‘అతడు అర్ధరాత్రి ఫోన్ చేశాడు.. అలా రెండు రోజులు నిద్రపోలేదు’

అస్సాం నుంచి వచ్చి దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి కయదు లోహర్ (Kayadu Lohar). వరుస విజయాలతో భారీ పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం మల్టీ లాంగ్వేజ్ హీరోయిన్‌గా దూసుకుపోతున్నారు.'రిటర్న్‌ ఆఫ్‌ది డ్రాగన్‌' సినిమాతో ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ, ఆ సూపర్ హిట్ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా యువతలో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఓ మ్యూజిక్ డైరెక్టర్ తనకు అర్థరాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడనీ, ఆ సమయంలో చాలా కంగరూ పడ్డనని చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే?

'రిటర్న్‌ ఆఫ్‌ది డ్రాగన్‌' విజయంతో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో వరుస అవకాశాలు కాయడానికి వెతుక్కుంటూ వచ్చాయి. తెలుగులో ఇటీవల నటించిన 'ఫంకీ' సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా, ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. మరోవైపు మలయాళంలో చేసిన 'పళ్లిచట్టంబి' సినిమా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోంది. అలాగే నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమాలో హీరోయిన్‌గా అవకాశం రావడం కెరీర్‌లో కీలక మలుపు తిరిగింది.

Kayadu Lohar Midnight Call Shock Two Sleepless Nights for Pavazha Malli Song Success

ఇదిలా ఉంటే.. 'డ్యూడ్' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయి అభ్యంకర్, సినిమాలతో పాటు ఆల్బమ్ సాంగ్స్‌లోనూ తనదైన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే హిట్ సాంగ్స్ అందించిన ఆయన, తాజాగా 'పవళ మల్లి (Pavazha Malli)' అనే పాటతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సాంగ్‌లో కయదు లోహర్ కనిపించగా, వీరిద్దరి కాంబినేషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు మిలియన్ల వ్యూస్ రావడం, ప్రేక్షకులు ఎంతగా ఆదరించారో చెప్పకనే చెబుతోంది. అయితే ఈ సాంగ్‌లో తనకు అవకాశం ఎలా వచ్చిందో కాయదు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వివరించింది.

కాయదు మాట్లాడుతూ.. అర్ధరాత్రి సమయంలో సాయి నుంచి ఫోన్ రావడంతో మొదట ఆశ్చర్యపోయా, కానీ పాట వినగానే నచ్చి వెంటనే ఓకే చెప్పానని చెప్పింది. ఇక ఈ సాంగ్ కోసం ఎంత కష్టపడ్డామో ఆమె కూడా. రిహార్సల్స్, షూటింగ్ కారణంగా అర్ధరాత్రి 2 గంటల వరకూ పని చేయాల్సి వచ్చిందని, దాదాపు రెండు రోజులు నిద్ర లేకుండా షూట్ చేశామని చెప్పింది. ఈ డెడికేషన్ ఇప్పుడు సక్సెస్‌గా మారిందని చెప్పాలి. పాట హిట్ అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు కాయదు, సాయి అభయంకర్‌లను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కష్టానికి ఫలితం దక్కింది, డెడికేషన్ ఉంటేనే ఇలాంటి హిట్ వస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్, అలాగే కాయదు డెడికేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక తాను దక్షిణాది అమ్మాయి కాదని, అందుకే తెలుగు, తమిళం, మలయాళం మాట్లాడటం ప్రారంభంలో కష్టంగా అనిపించిందని చెప్పింది. అయితే "ఏ భాషలో నటిస్తే ఆ భాష నేర్చుకోవడం ముఖ్యం" అంటూ త్వరలోనే ఈ భాషల్లో ఫ్లూయెంట్‌గా మాట్లాడేలా కృషి చేస్తున్నాను. ఆమె ప్రొఫెషనల్ అటిట్యూడ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చిపెడుతోంది.

ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టీవ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలు, అప్ డేట్స్ తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు 'ది ప్యారడైజ్' లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లోకాయదు లోహర్ భాగం కావడంతో.. టాలీవుడ్‌లో త్వరలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ అస్సామీ బ్యూటీ మరింత పెద్ద స్థాయికి చేరడం ఖాయమని చెప్పొచ్చు.

Read more about: kayadu lohar nani The Paradise
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X