లిక్కర్ స్కామ్‌లో కాయదు లోహర్?.. నైట్ పార్టీల్లో డ్రాగన్ హీరోయిన్‌కు ఎంత డబ్బు ముట్టిందంటే?

డ్రాగన్ చిత్రంతో దక్షిణాది సినీ పరిశ్రమలో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన కాయదు లోహర్ తమిళనాడులో సంచలనం రేపిన లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కుపోయింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పోరేషన్ (TASMAC) లో జరిగిన ఆర్థిక అవకతవకల కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) ఇటీవల చెన్నై, ఇతర ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో యువ నటి కాయదు లోహర్ పేరు బయటకు రావడం మరింత సంచలనం రేపింది. ఈ కేసుతో ఆమెకు ఉన్న సంబంధమేమిటనే వివరాల్లోకి వెళితే..

కాయదు లోహర్ విషయానికి వస్తే.. అసోంలోని తేజ్‌పూర్‌కు చెందినది. ఆమె ఫ్రెష్ ఫేస్ సీజన్ 12 టైటిల్‌ను గెలుచుకొన్న తర్వాత ఆమె తొలుత కన్నడ సినీ రంగంలోకి ప్రవేశించింది. ముజిల్‌పేట్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. ఆ తర్వాత మలయాళం, తమిళం, తెలుగు సినిమా పరిశ్రమలో బిజీగా మారింది. తెలుగులో అల్లూరి అనే సినిమాలో నటించింది. మరాఠీలో ఐ ప్రేమ్ యూ అనే సినిమాలో నటించింది. ఇటీవల విడుదలైన డ్రాగన్ సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది. ఈ క్రమంలో ఆమె పేరు లిక్కర్ స్కామ్‌లో కీలకంగా మారడం సెన్సేషన్ క్రియేట్ చేసింది.

Kayadu Lohar Name in Liquor Scam

తమిళనాడును కుదిపేసిన లిక్కర్ స్కామ్‌లో హీరోయిన్ కాయదు లోహర్ పేరు రావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ఆమెను ఈడీ అధికారులు విచారిస్తారనే ప్రచారం జరిగింది. ఈ స్కామ్‌లో ఉన్న ప్రముఖుల నిర్వహించిన నైట్ పార్టీలకు ఆమె హాజరయ్యారు. అందుకు గాను ఆమెకు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పారు అనే విషయం ఈడీ అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది.

అయితే నైట్ పార్టీలకు హాజరైనందుకు గాను.. కాయదు లోహర్‌కు సుమారుగా 35 లక్షల రూపాయలు ముట్ట జెప్పారు. ఆమె అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అయిన డబ్బు విషయంలో ఐటీ అధికారులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంలో కొన్ని సంస్థలు ఆర్థిక చెల్లింపులను పరిశీలిస్తే.. మనీలాండరింగ్ జరిగి ఉంటుందా అనే అనుమానాన్ని వారు వ్యక్తం చేయడంతో ఈడీ రంగంలోకి దిగింది అని హిందూస్థాన్ టైమ్స్ తన కథనంలో పేర్కొన్నది.

తమిళనాడులోని మార్కెటింగ్ కార్పోరేషన్ విభాగంలో 1000 కోట్ల రూపాయలకుపైగా కుంభకోణం జరిగింది. ఈ కేసులో మనీలాండరింగ్ పెద్ద ఎత్తున్న జరిగిందనే ఆరోపణలతో ఈడీ అధికారులు పలువురు ప్రముఖలు నివాసాలపై దాడులు చేయడం అత్యంత వివాదాస్పదమైంది. ఈ దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు చట్ట పరిధిలను ఉల్లంఘించారు. ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించేలా ప్రవర్తించారు అంటూ ఈ కేసు విచారణపై స్టే విధించడం మరింత సంచలనం రేపింది.

అయితే ఈ స్కామ్‌లో కాయదు లోహర్ పేరు రావడంపై ఆమె పీఆర్ వర్గాలు గానీ, ఆమె మేనేజర్, సిబ్బంది గానీ స్పందించ లేదు. ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం శింబుతో ఓ సినిమాలో నటిస్తున్నది. తెలుగులో రెండు మూడు సినిమాలు అంగీకరించి టాప్ హీరోల సరసన నటిస్తున్నది. ఈ వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

More from Filmibeat

Read more about: kayadu lohar kollywood dragon
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X