Kayadu Lohar: అలా కమిటైపోయా.. రిలేషన్‌షిప్‌పై నోరు విప్పిన కాయదు లోహర్
ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి స్టార్ అయిన నటీనటులు .. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎందరో న్నారు. ఈ కోవలోకే వస్తారు కాయదు లోహర్. కేవలం పేరు ద్వారానే ఈ ముద్దుగుమ్మ పాపులర్ అయ్యారంటే అతిశయోక్తి కాదు. దానికి తోడు అందంతో కుర్రాళ్లకు మెస్మరైజ్ చేస్తున్నారు కాయద్ లోహర్. ప్రస్తుతం దక్షిణాది కుర్రాళ్లకు క్రష్‌గా మారారు ఈ బ్యూటీ. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
పుణేలో స్థిరపడిన అస్సాం అమ్మాయి కాయదు లోహర్. ఆమె స్వస్థలం తేజ్‌పూర్. ఏప్రిల్ 11, 2000లో ఈ ముద్దుగుమ్మ జన్మించారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత మోడలింగ్‌లోకి దిగిన కాయదు.. మోడల్‌గా కొన్ని ఫ్యాషన్ షోలు, యాడ్స్‌లో నటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం సినీరంగం నుంచి ఆమెకు పిలుపొచ్చింది. కడన్న సినిమా ముగిళ్ పెటేతో వెండితెరపై అడుగుపెట్టారు కాయదు లోహర్. ఆ తర్వాత మలయాళంలో పతోన్ పతమ్ నూట్టండులో నటనకు గాను మంచి గుర్తింపు వచ్చింది.

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు హీరోగా వచ్చిన అల్లూరి మూవీతో కాయదు లోహర్ తెలుగువారిని పలకరించింది. ఇందులో తన పరువాలతో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది. సినిమా డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ కాయదు అందాలకు మంచి మార్కులు పడ్డాయి. అయితే కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సరసన నటించిన రిటర్న్ ఆఫ్ డ్రాగన్ ఆమెకు హీరోయిన్‌గా బ్రేక్ తీసుకురావడంతో పాటు ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌ని చేసింది. నిజానికి ఇది ఆమెకు కెరీర్‌లో 6వ చిత్రం.. అయినప్పటికీ ఇదే తొలి సినిమా అన్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కాయదు. ఇందులో కాయదు నటన.. పరువాలు యువతకు పిచ్చెక్కించాయి.
ఈ సినిమా దెబ్బకు వరుస అవకాశాలు కాయదు లోహర్ ముంగిట క్యూకట్టాయి. దక్షిణాదిలోని అన్ని భాషలకు చెందిన దర్శక నిర్మాతల నుంచి ఆఫర్లు వెల్లువలా వచ్చాయి. డ్రాగన్ తర్వాత ఫంకీ అనే తెలుగు సినిమాలో నటించారు కాయదు. ప్రస్తుతం ఆవిడ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయంటే కాయదు క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగులో ది ప్యారడైజ్, తమిళంలో ఇదాయం మురళి, ఇమ్మోర్టల్, శింబు 49.. మలయాళంలో పల్లిచట్టాంబి, ఐయామ్ గేమ్, తారం సినిమాలలో కాయదు లోహర్ నటిస్తున్నారు.
నటీనటులపై చిత్ర పరిశ్రమలో గాసిప్స్ రావడం ఖాయం. దానికి తగినట్లుగా కాయదు లోహర్ మీదా బోల్డెన్నీ గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్‌తో కాయదు లోహర్ డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఇవి గాలివార్తలుగా మిగిలిపోయాయి. కాగా.. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కాయదు. నేను ప్రస్తుతానికి నటనకు, వృత్తికి కమిటైపోయాను. ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నానని తనపై వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టింది కాయదు లోహర్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications

















