ఎక్కడుంటే అక్కడ అద్భుతమే.. కీర్తి సురేష్ పోస్ట్
మహానటి సినిమాతో అందర్నీ తనవైపుకు తిప్పుకుంది కీర్తి సురేష్. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఆ చిత్రంలో కీర్తీ సురేష్ అద్భుతమైన నటనను కనబర్చింది. తెరపై చూస్తున్నంత సేపు సావిత్రినే చూస్తున్నామా? అనే ఫీలింగ్ కలిగించేలా నటించి అందర్నీ మెప్పించింది. అందుకే ఆమె నటనకు జాతీయ అవార్డు కూడా శిరస్సు వంచింది.
మహానటితో క్రేజ్ తెచ్చుకున్న కీర్తీ సురేష్ లేడీ ఓరియోంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. మహానటి తరువాత తెలుగు సినిమాల్లో నటించని కీర్తి.. త్వరలోనే ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమవుతోంది. ఎస్‌ఎమ్‌కే కోనేరు నిర్మాణంలో నరేంద్ర నాథ్ తెరకెక్కిస్తున్న మిస్ ఇండియా చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది.

మిస్ ఇండియా చిత్రం ఏప్రిల్ 17న రాబోతోన్నట్టు చిత్రయూనిట్ ప్రకటించింది. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు ఆ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..'మేము ఎక్కడుంటే.. అక్కడ ఎల్లప్పుడూ అద్భుతమే.. మిస్ ఇండియా టీమ్ తరుపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు' అని ట్వీట్ చేసింది.


Click it and Unblock the Notifications











