‘మిస్ ఇండియా’ అంటే నేను కాదు.. అదో బ్రాండ్.. కీర్తి సురేష్ చించేసింది!
మహానటి సినిమాతో అందర్నీ తనవైపుకు తిప్పుకుంది కీర్తి సురేష్. మహానటి సినిమాలోని కీర్తి నటనకు జాతీయ స్థాయిలోగుర్తింపు లభించింది. ఇలా మహానటి కీర్తి సురేష్ కెరీర్‌లో నిలిచిపోగా.. ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అందుకే వరుసగా చిత్రాలను ఒప్పేసుకుంది. అందులోనూ అన్నీ కూడా లేడీ ఒరియెంటెడ్ చిత్రాలే. ఇప్పటికే పెంగ్విన్ చిత్రం రిలీజ్ అయింది. సినిమా అంతగా ఆడకపోయినా కీర్తి సురేష్‌కు మాత్రం మంచి పేరు వచ్చింది.
ఇక గుడ్ లక్ సఖి కూడా రెడీ అవుతోంది. అది వచ్చే లోపే మిస్ ఇండియా అందర్నీ పలకరించేందుకు రెడీ అయింది. నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇందులో కీర్తి సురేష నటన ఓ రేంజ్‌లో ఉంది. చిన్నతనం నుంచి బిజినెస్ చేసి ఎదగాలనే ఆలోచనలతో పెరిగిన మధ్య తరగతి అమ్మాయి సంయుక్త పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టేసింది.

విలన్ అయిన జగపతి బాబు కీర్తి సురేష్‌కు వార్నింగ్ ఇవ్వడం.. బిజినెస్ అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆటలు కాదు.. అదొక యుద్దం అంటూ కీర్తి సురేష్‌ను హెచ్చరించడం.. బిజినెస్ చేయడానికి పుట్టాను అంటూ దాని కోసం ఏదైనా చేస్తాను అంటూ కీర్తి సురేష్ కౌంటర్ ఇవ్వడం ఇలా ప్రతీ ఒక్క సీన్ అదిరిపోయింది. మన దేశంలోని కాఫీని విదేశాల్లో ఫేమస్ చేసి వ్యాపారవేత్తగా ఎదిగినట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే మిస్ ఇండియా అంటే నేను కాదు.. అదో బ్రాండ్ అంటూ కీర్తి సురేష్ డైలాగ్ కొట్టినట్టుంది. ఇందులో తమన్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇక ట్రైలర్ మాత్రం బాగానే ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలను పెంచేసింది.


Click it and Unblock the Notifications











