ఆ విషయంలో సమంతని ఫాలో అవుతున్న మహానటి.. కీర్తి సురేశ్ కు బెస్ట్ విషెస్ చెప్తున్న ఫ్యాన్స్!
Keerthy Suresh's Wedding Card: ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సెలబ్రిటీలు తమకు నచ్చిన వారితో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్దమవుతున్నారు. తమ బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బాయ్ చెప్తూ మ్యారేజ్ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే నాగచైతన్య శోభితాలు తమ ప్రేమ బంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నారు. తాజాగా మరో టాలీవుడ్ హీరోయిన్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ వెడ్డింగ్ కార్డు నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు?
ఆ అమ్మడు ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. మలయాళం అమ్మాయి అయినా తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ విజయాలను అందుకుంది. కీర్తి సురేష్ బాలనటిగా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది . 2000లో మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఎన్నో సినిమాలలో తన నటనతో అలరించింది. ఇక 'గీతాంజలి' అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మలయాళం ముద్దుగుమ్మ ఈ క్రమంలోనే టాలీవుడ్ లో ఆఫర్లు అందుకుంది. ఇలా రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన 'నేను శైలజ' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేశ్.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లను అందుకుంది. ఆ తర్వాత నాచురల్ స్టార్ నాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కింగ్ నాగార్జున వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని పొందింది. ఇక కీర్తి సురేష్ కెరీర్లో 'మహానటి' సినిమా ఒక మైలురాయిగా చెప్పవచ్చు. అలనాటి సినీ తార సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రను నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంది. అప్పటినుండి భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళం లో సినిమాలు చేస్తోంది.
తన అందం అభినయంతో బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా నిలిచింది.
ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. కానీ, ఈ సినిమా తర్వాత ఆశించిన స్థాయిలో విజయాలు అందకపోవడంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కు దూరమై.. బాలీవుడ్, కోలీవుడ్ కు దగ్గర అయింది. ఇక కీర్తి సురేష్ పర్సనల్ విషయానికొస్తే.. గత కొన్ని రోజులుగా కీర్తి సురేష్ పెళ్లి గురించి పలు వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
గత కొంతకాలంగా కీర్తి సురేష్ తన స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఇటీవల ఇంస్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. తామద్దరం 15 సంవత్సరాలుగా రిలేషన్ లో ఉంటున్నామని తెలుపుతూ దీపావళి సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టు చేసింది. ఇటీవల కీర్తి సురేష్ తన కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పెళ్లి గోవాలో జరుగుతుందని స్వయంగా కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ వెడ్డింగ్ కార్డు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ అమ్మడు పెళ్లి డిసెంబర్ 14న జరగబోతుంది. ఈ కార్డులో డిసెంబర్ 14న మా కూతురి పెళ్లి చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి తనకి మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. ఇట్లు సురేష్ కుమార్ మేనక అని పేర్కొన్నారు. కీర్తి సురేష్ డెస్టినేషన్ మ్యారేజ్ గోవాలో జరగబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం కీర్తి సురేష్ కు సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ అయితే నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది.
మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే.. కీర్తి సురేష్ ఇటు హిందూ సాంప్రదాయం ప్రకారం.. అటు క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోను పోతున్నట్లు తెలుస్తోంది. అంటే డిసెంబర్ 12న ఉదయం కీర్తి సురేష్ మెడలో ఆంటోనీ తాళిబొట్టు కట్టబోతున్నాడు . అదేరోజు సాయంత్రం గోవాలోని ప్రముఖ చర్చిలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోబోతున్నారు. గతంలో సమంతా నాగచైతన్యాలు కూడా ఇదే పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని ఆ తర్వాత కృష్ణ సాంప్రదాయం ప్రకారం ఉంగరాలు మార్చుకున్నారు. దీంతో కీర్తి సురేష్ సమంత ను ఫాలో అవుతుంది అంటూ సిటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వీరి జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











