»   » ఏదో ఒక రోజు ఆ బాధ నీకూ తెలుస్తుంది: కీర్తీ సురేష్ మీద శ్రీరెడ్డి ఫైర్!

ఏదో ఒక రోజు ఆ బాధ నీకూ తెలుస్తుంది: కీర్తీ సురేష్ మీద శ్రీరెడ్డి ఫైర్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Sri Reddy Comments On Keerthi Suresh

  తెలుగు, తమిళ ఇండస్ట్రీలోని పెద్ద హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్న కీర్తి సురేష్‍‌ను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది. తన విషయంలో కీర్తి సురేష్ ప్రవర్తించిన తీరు ఎంతో బాధించిందంటూ శ్రీరెడ్డి మండి పడ్డారు. ఆమె మీద శ్రీరెడ్డికి ఇంత కోపం రావడానికి కారణం ఇటీవల ఓ తమిళ మూవీ ఆడియో వేడుకలో విశాల్.... శ్రీరెడ్డి గురించి మాట్లాడుతున్న సందర్భంలో కీర్తీ సురేష్ వెకిలిగా నవ్వడమేనంట.

  నన్ను చూసిన నవ్వుతావా?

  నన్ను చూసిన నవ్వుతావా?

  విశాల్ నా గురించి మాట్లాడినపుడు... కీర్తి సురేష్ నవ్వడం చూసిన అసహ్యం వేసింది. ఇపుడు నీ టైమ్ బావుంది కాబట్టి నువ్వు మేఘాల్లో తేలిపోతున్నావు. కానీ నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉంటావని అనుకోకు.. అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించారు.

  ఆ బాధ ఏదో ఒకరోజు నీకు తెలుస్తుంది

  ఆ బాధ ఏదో ఒకరోజు నీకు తెలుస్తుంది

  సినిమా రంగంలో అందరూ ఎప్పుడూ ఒకే పొజిషన్లో ఉండరు. ఏదో ఒకరోజు స్ట్రగులర్స్ బాధ ఏమిటో నీకూ అర్థమవుతుంది. నువ్వు ఈ రోజు నవ్విన ఆ వెకిలి నవ్వును నేను ఎప్పటికీ మరిచిపోలేను అని శ్రీరెడ్డి అన్నారు.

   శ్రీరెడ్డి గురించి విశాల్ ఏమన్నారంటే?

  శ్రీరెడ్డి గురించి విశాల్ ఏమన్నారంటే?

  ‘సందెకోళి-2' ఆడియో వేడుకలో విశాల్ మాట్లాడుతూ... శ్రీరెడ్డి మంచి అవకాశాలు దక్కించుకుంటూ వివాదాలకు దూరంగా ఉండటం మంచి పరిణామం. అయితే ఆమెతో పని చేసే వారు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్రీరెడ్డి చుట్టూ ఉండే వారు వారి సేఫ్టీ కోసం కెమెరాలతో ఉండాలి. దీని వల్ల ఆమెకు ఆటోమెటిక్‌గా రక్షణ లభించినట్లే' అన్నారు.

  విశాల్‌కు కామెంటుపై శ్రీరెడ్డి

  విశాల్‌కు కామెంటుపై శ్రీరెడ్డి

  విశాల్ కామెంట్లపై శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పేజీ ద్వారా స్పందించారు. తన గురించి పాజిటివ్‌గా స్పందించినందుకు థాంక్స్ చెప్పారు. మీ మనసు చాలా మంచిది.... కానీ నా చుట్టూ ఉన్నవారు కెమెరాలు కలిగి ఉండాలని ఎందుకు అన్నారో అర్థం కాలేదు అని శ్రీరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  English summary
  "Keerthi suresh is laughing so awkward when vishal garu is talking about me..dn worry madam u wl not be a best position always..one fine day you wl understand struggler's pain..i never forget ur smile..mind it..hum.. you are flying in the clouds now." Sri Reddy said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more